కూటమి పార్టీలను టెన్షన్ పెడుతున్న రెబల్స్

congress party latest news

మహాకూటమికి ఇప్పుడు రెబల్స్ బెడద పట్టుకుంది. టీఆర్ఎస్ ను ఓడించే లక్ష్యంతో పొత్తులతో పోటీ కి దిగుతున్న కూటమి పార్టీలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. పొత్తు నేపధ్యంలో సీట్ల పంప‌కాల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిష్టంభ‌న కొనసాగింది. కానీ తాజాగా సీట్ల ఖ‌రారు అయ్యిందని చెప్పటంతో  ఆశావహులు పెద్ద ఎత్తున ఒత్తిడికి దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంమీద ఉన్న 119 స్థానాల‌ను మ‌హాకూట‌మిలోని కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్ , సీపీఐలు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే వీటి పంపకాలు జరిగే క్ర‌మంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు ఇబ్బంది ఎదురైతే ఆందోళనలు తప్పవనే టాక్ వినిపిస్తోంది. దీంతో కూట‌మి నేతలు రాబోయే పరిస్థితులను తలచుకొని భయపడుతున్నారట.

కాంగ్రెస్ పార్టీలో 5 వేల మంది ఆశావహులు పోటీ కి మొగ్గు చూపటం తో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో గుబులు మొదలైంది.  అసంతృప్తి రగిలితే కేసీఆర్ కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలకు గాలం వేసే అవకాశం వుందని ఆందోళనలో ఉన్ననారు. అయితే దీనిని ముందుగానే గమనించి అసంతృప్తులను బుజ్జ‌గించ‌డం మొద‌లుపెడితే స‌మ‌స్య నుంచి బయటపడవచ్చని పలువురు నేతలు అనుకుంటున్నారట‌.

కూట‌మిలో వున్న మిగ‌తా పార్టీల కన్నా, కాంగ్రెస్ కు అసంతృప్తి నేత‌ల నుంచి త‌ల‌నొప్పులు ఎదురవుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఖచ్చితంగా పోటీకి దిగాల‌ని 5వేల‌ మంది అభ్య‌ర్థులు భావిస్తున్నారట. అయితే వారంద‌రినీ బుజ్జ‌గించ‌డం కాంగ్రెస్ నేతలకు పెను సవాల్ గా మారనుందని సమాచారం. ఇక టీటీడీపీ నుంచి 156 మంది టికెట్ కోసం పోటీప‌డుతున్నారని తెలుస్తోంది. అయితే వీరిలో సీనియ‌ర్లే అత్య‌ధికంగా వుండ‌టం టీడీపీని ఆందోళనకు గురిచేస్తోంది . ఇక సీపీఐ నుంచి 12మంది టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. వీరిలో అంద‌రికీ టికెట్ వ‌స్తుంద‌నే గ్యారెంటీ ఎంతమాత్రం లేదు. ఇక తెలంగాణ జన సమితి నుంచి ఏకంగా 500 మంది టికెట్లు ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే వారికి సీట్ల కేటాయింపుల్లో 12 నుంచి 15 సీట్లు మాత్ర‌మే వ‌చ్చే అవ‌కాశం వుందని సమాచారం. దీంతో ఆ పార్టీకి అసంతృప్తుల నుంచి భారీస్థాయిలో ఎదురుదాడి త‌ప్ప‌ద‌ని విశ్లేషకులు అంటున్నారు. కూటమిలోని  అన్ని పార్టీలకు రెబల్స్ బెడద ఉన్నా కాంగ్రెస్ కు మాత్రం రెబల్స్ బెడద ప్రాణ సంకటంగా ఉంది. మరి కూటమి పార్టీలు అసంతృప్తి సెగలు వ్యాపించకుండా ఆపగలరా లేదా అనేది త్వరలోనే తెలియనుంది.

congress party latest news,mahakutami latest news,mahakutami party tickets announcing soonly,congress party contesing 119 mla`s in elections

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *