కాంగ్రెస్ ఆఫర్.. నో అంటున్న సీపీఐ

congress party latest news

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితిలు కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి గురించి రోజుకో వార్త హాట్ టాపిక్‌గా మారుతోంది. కూటమి ఏర్పాటు చేసి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా.. వారి మధ్య సీట్ల సర్ధుబాటులో మాత్రం అవగాహన లోపిస్తోంది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి ఎన్ని స్థానాలను కేటాయించాలనేదానిపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఈ ప్రాసెస్‌ను వేగవంతం చేసింది ఆ పార్టీ అధిష్ఠానం. మరోవైపు, కాంగ్రెస్ తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తుందంటూ సీపీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మహాకూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది సీపీఐ. అయితే, ఈ పార్టీ సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న వైఖరికి నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు, సర్ధుబాటు త్వరగా తేల్చకుంటే కూటమి నుంచి బయటకు వెళ్లిపోతామని కూడా తెగేసి చెప్పింది. ఇందుకోసమే ప్లాన్ బీని కూడా సిద్ధం చేసుకుంది. తాము అడిగినన్ని సీట్లు ఇస్తే పర్లేదని, లేని పక్షంలో తొమ్మిది స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. అంతేకాదు ఆయా స్థానాలను కూడా వెల్లడించారు ఆ పార్టీ నేతలు.

కూటమిలోని టీడీపీకి కేటాయించే సీట్లపై స్పష్టత వచ్చినప్పటికీ సీపీఐ, తెలంగాణ జనసమితి సీట్ల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పార్టీల మధ్య ఎన్ని చర్చలు జరిగినా సీట్ల సర్ధుబాటు మాత్రం కొలిక్కి రావడంలేదు. టీజేఎస్ విషయంలో కొంత క్లారిటీ ఉన్నప్పటికీ, సీపీఐ విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి సీపీఐ మొదటి నుంచీ తమకు 9 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపుతోంది. కానీ, కాంగ్రెస్ మాత్రం మూడు సీట్లకు మించి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో కొంచెం తగ్గిన సీపీఐ పొత్తులో భాగంగా ఐదు స్థానాలు (హుస్నాబాద్‌, కొత్తగూడెం, వైరా, బెల్లంపల్లి, మంచిర్యాల) తమకు ఖచ్చితంగా ఇవ్వాలని పట్టుబడుతోంది. దీనికి కూడా నో చెప్పిన కాంగ్రెస్ అధిష్ఠానం.. సీపీఐకు ఓ ఆఫర్ ఇచ్చిందట. మంచిర్యాల, బెల్లంపల్లి, వైరా ఇస్తామని, వీటితో పాటు భవిష్యత్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయిస్తామని ఆ పార్టీ నేతలతో చెప్పారని సమాచారం. కాంగ్రెస్ ఇస్తానంటున్న స్థానాల్లో ఏకంగా రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆశిస్తున్న హుస్నాబాద్‌ లేకపోవడంతో సీపీఐ ఈ ప్రతిపాదనను నిరాకరించిందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీపీఐ కూటమిలో ఉంటుందా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.

congress party latest news,congress party gave offer to cpi party,cpi party dont want any offer says cpi leaders,cpi leaders comments on congress leaders

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *