జనగామ జగడం కొలిక్కి వచ్చేనా

congress party latest news

కూటమి లెక్కలు ఒక్కోక్కటి కొలిక్కి వస్తున్నా.. జనగామ సీటు విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ నుంచి పొన్నాల, టీజేఎస్ నుంచి కోదండరాం ఇద్దరు ఈ సీటును ఆశించడంతో.. ఇక్కడ బరిలో నిలిచెదెవరు అనేది ఉత్కంఠగా మారింది. తన సీటు తనకే కేటాయించాలని పొన్నాల పట్టుపడుతుంటే.. కోదండరాం మాత్రం, అవసరమైతే తాను బరిలో నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాపై సొంత పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పలువురు సీనియర్‌ నేతలకు సైతం తొలి జాబితాలో టికెట్లు దక్కకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి.. కాంగ్రెస్‌ పార్టీని ముందుండి నడిపించిన పొన్నాల లక్ష్మయ్యకు ఫస్ట్‌ లిస్ట్‌లో చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో టెన్షన్‌‌కు గురైన పొన్నాల… హుటాహుటినా ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్‌ పెద్దలను కలిసి తన సీటుపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు లైన్ క్లియర్ అయ్యిందా..?  కాంగ్రెస్ రెండో జాబితాలో ఆయన పేరు ఉంటుందా..? ఈ విషయమై అధిష్టానం నుంచి పొన్నాలకు స్పష్టమైన హామీ వచ్చిందా..? అంటే తాజా పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తోంది. మొదటి జాబితాలో పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి, అవమానానికి గురైన పొన్నాల, ఆయన అనుచరులు, కార్యకర్తలు ఇప్పుడు ఆనందంలో మునిగి తేలుతున్నారు. తొలి జాబితాలో పేరు లేకపోవడం…. ఆశ్చర్యంతోపాటు ఆందోళన కలిగించిందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామ టికెట్‌ను టీజేఎస్‌కు కేటాయిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్న పొన్నాల.. రెండో జాబితాలో తన పేరు ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

     మరోవైపు, జనగాం బరి నుంచి తప్పుకోవాలని టీజేఏస్ అధ్యక్షుడు కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీసీలకు అన్యాయం జరగకూడదనే కోదండరాం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. జనగాం నుంచి కోదండరాం పోటీ చేస్తారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, బీసీలకు అన్యాయం చేయడం తమకు ఇష్టం లేదని, అందుకే కోదండరాం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? అసలు పోటీ చేస్తారా..? లేదా తమ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితమవుతారా..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

congress party latest news,congress ex minisetr ponnala laxmaiah latest news,janagoan mla seat for ponnala laxmaiah,kodhandaram latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *