కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి..

congress party latest news

‘నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఎన్నికల వేళ  కాంగ్రెస్ కి తొలి షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గా పోటీ కి నామినేషన్ వేసిన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి అయ్యింది.  ఇప్పటికే సీట్ల కేటాయింపు జాప్యం అయ్యింది అంటే ఇప్పుడు ఈ తాజా తలనొప్పులతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతుంది.

ప్రతిష్టాత్మకమైన సెగ్మెంట్ అయిన ఖైరతాబాద్ నుండి తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజుకు అసెంబ్లీ టికెట్ కేటాయించారు. చివరి దాకా ఆయన విషయంలో పోటీ నెలకొంది. టికెట్ మీద ఉత్కంఠ కొనసాగింది. ఫైనల్ గా  దాసోజుకు టికెట్ ఇస్తూ ప్రకటన చేశారు కాంగ్రెస్ నాయకులు. ఆయనకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోవడం వల్ల గతంలో టిఆర్ ఎస్ లో కూడా దాసోజు అవమానపడ్డారని చెబుతారు.

పంచాయతీనుంచి పార్లమెంటు దాకా నియోజకవర్గాలన్నీ  వారసత్వ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతుంటే రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేని నేతగా ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు దాసోజు. రాజకీయపార్టీలలో బతకాలంటే ఉన్నత కులం ఉండాలి. రాజకీయ పార్టీల ముఖ్య నాయకుల అండ ఉండాలి. లేదా పిచ్చి పిచ్చిగా డబ్బుండాలి. ఇవి లేని దాసోజుకు టిఆర్ ఎస్ లో టికెట్ ఇవ్వలేదు.నీ కులానికి ఓట్లే లేవు, నువ్వు ఎలా గెలుస్తావని 2014 ఎన్నికలపుడు కేసీఆర్  దాసోజును అవమానపర్చాడని, అందుకే ఆయన టిఆర్ఎస్ కు గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లో చేరాడని చెబుతారు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెంది ఉండటం, దానికి తోడు పెద్దగా జనాభా లేని కంసాలి కులానికి చెంది ఉండటం వల్ల ఆయనకు టికెట్ వస్తుందా రాదా అనేది సస్పెన్స్ ఉండేది. కానీ కాంగ్రెస్ అధిష్టానం సీటు కేటాయించింది.

మహాకూటమి తరపున కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన దాసోజు శ్రవణ్‌కుమార్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఆయన సహచరులు ఖైరతాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి వద్దకు వచ్చారు. అయితే అభ్యర్థి లేకపోవడం, ప్రపోజల్‌గా ఉన్న వారు కూడా అక్కడ ప్రత్యక్షంగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ పత్రాలను తీసుకునేందుకు రిటర్నింగ్‌ అధికారి ముషారఫ్‌ ఫారుఖీ నిరాకరించారు. నామినేషన్లు తీసుకోటానికి నిబంధనలు ఉన్నాయని ఇతరుల తరపున నామినేషన్లను స్వీకరించాలంటే అభ్యర్థి కానీ, ఆయన ప్రతిపాదించిన ఓటరు కానీ తప్పనిసరిగా ఉండాలని, దాసోజు విషయంలో ఇద్దరు లేకపోవడంవల్లే నామినేషన్‌ను తీసుకోలేదని తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌ నుంచి 100 మీటర్ల పరిధి వరకు సెక్షన్‌ 144 అమలులో ఉండటంతో  నామినేషన్‌ కోసం వచ్చే అభ్యర్థుల అనుచరులు, ఎవరైనా నినాదాలు చేయకూడదని తెలిపారు. అభ్యర్థితో పాటు కేవలం నలుగురికి మాత్రమే కార్యాలయ గేటు లోపలికి అనుమతిస్తామని చెప్పిన అధికారులు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకూడదని సూచించారు.

congress party latest news,congress party leader dasoju shravan kumar nomination not filed,returning officer serious on dasoju shravan kumar

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *