సీట్ల కోసం కాంగ్రెస్ నేతల ఆందోళనలతో ఉద్రిక్తంగా గాంధీ భవన్

congress party news

తెలంగాణా లో కూటమిలోని ప్రధానపార్టీ  అయిన కాంగ్రెస్ లో టికెట్ల యుద్ధం తారా స్థాయికి చేరుతుంది. భాగస్వామ్య పార్టీలకు టికెట్లు ఇవ్వొద్దని కోరుతూ  రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, వారి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. గాంధీ భవన్ వద్ద వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. కాంగ్రెస్ నాయకులు తమకే టికెట్లు కేటాయించాలని  డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ వద్ద హల్ చల్ చేస్తున్నారు.

మల్కాజిగిరి సీటును  టీజేఎస్‌కు కేటాయించకూడదని కాంగ్రెస్ నేత శ్రీధర్  వర్గీయులు ఆందోళనకు దిగారు. శనివారం నాడు ఉఫ్పల్, నకిరేకల్  నియోజకవర్గాలకు చెందిన ఆశావాహులు ఆందోళనకు దిగారు.ఉప్పల్ స్థానాన్ని టీడీపీకి కేటాయించకూడదని  కాంగ్రెస్ పార్టీకే ఈ స్థానాన్ని కేటాయించాలని లక్ష్మారెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు.ఈ విషయమై తమ అభిప్రాయాన్ని   కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడ చెప్పినట్టు లక్ష్మారెడ్డి కూడా చెబుతున్నారు.కూటమి లక్ష్యం మేరకు టీడీపీకి సీటొస్తే… మనం పనిచేయాలి… మనకు సీటొస్తే  టీడీపీ మన కోసం పనిచేస్తోందని ఆయన చెప్పారు. అయితే అసమ్మతి నేతలు మాత్రం ఆగ్రహావేశాలతో ఉన్నారు.

ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం నుండి రమేష్ రాథోడ్  కు టికెట్టు ఇవ్వకూడదని రెండు రోజులుగా హరినాయక్‌ వర్గీయులు గాంధీ భవన్ ఎదుట దీక్ష చేస్తున్నారు.మరో వైపు నకిరేకల్ సీటును  తనకు ఇవ్వాలని డాక్టర్ ప్రసన్నరాజ్ అనుచరులతో గాంధీభవన్ ఎదుట ధర్నాకు దిగారు. వారం రోజుల క్రితం శేరిలింగంపల్లి సీటును కాంగ్రెస్ కే ఇవ్వాలని కోరుతూ మాజీ  ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌తో పాటు ఆయన వర్గీయులు ధర్పా చేశారు. ఈ సీటును కాంగ్రెస్ పార్టీయే ఉంచుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.శనివారం నాడు ఉప్పల్ సీటును కాంగ్రెస్‌కే కేటాయించాలని… అంతేకాదు లక్ష్మారెడ్డికే సీటును ఇవ్వాలని  ఆయన అనుచరుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆశావహుల ఆందోళన గాంధీ భవన్ వద్ద దద్దరిల్లుతుంటే హస్తినలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇక్కడ వున్నా వాహావరణం అక్కడ ఉన్న నాయకులకు టెన్షన్ పుట్టిస్తుంది.

congress party news,congress leaders fighting about mla tickets,mahakutami leaders are fighting about mla tickets at gandhi bhavan

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *