కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన 20 స్థానాల కసరత్తు

Congress Update News

మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదు. 20 స్థానాల్లో ప్రతిష్టంభన వీడలేదు. అయితే ఈ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చర్చలు కొనసాగిస్తుంది. దేవరకొండ, తుంగతుర్తి, ములుగు వంటి 20 స్థానాల్లో చాలా మంది సీనియర్ నాయకులు అభ్యర్థులుగా బరిలో వుండటం తోనే ఈ ప్రతిష్టంభన నెలకొంది. ఎవరికి టికె ఇస్తే ఎవరు పార్టీ వీడిపోతారో అన్న భయంతోనే ఈ 20 స్థానాల్లో ఆచి తూచి వ్యవహరించనున్నారు. ఇక ఈ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, జానా రెడ్డి ఎవరికి వారు వేరు వేరు పేర్లు ప్రతిపాదిస్తున్నారు. ప్రతి నియోజక వర్గం లో సీనియర్ ల మధ్య టికెట్ వార్ నెలకొన్న నేపధ్యంలోనే సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు.
ఇక అభ్యర్థుల విషయానికొస్తే ములుగు నుండి పొడెం వీరయా, సీతక్క పేర్లు పరిశీలిస్తున్నారు. ఎల్లా రెడ్డి నుండి పైలా కృష్ణా రెడ్డి, సుభాష్ రెడ్డి , నల్ల మడుగు సురేందర్ పేర్లను ప్రతిపాదిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నుండి వెంకటేశ్వర్ రెడ్డి, భూపతి రెడ్డి పేర్లను ఇక నిజామాబాద్ అర్బన్ నుండి అరికెల నర్సారెడ్డి, మహేష్ గౌడ్ పేర్లను పరిశీలిస్తున్నారు. బాల్కొండ నుండి అనిల్, రాజా రాం యాదవ్,ఇక మంచిర్యాల నుండి ప్రేమ సాగర్ రావు , అరవింద్ రెడ్డి లలో ఒకని తుది జాబితాలో చేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక సూర్యాపేట నుండి పటేల్ రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి , ఇల్లందు నుండి హరి ప్రియ , ఊకే అబ్బయ్య దేవరకొండ నుండి బిల్యా నాయక, జగన్ ల పేర్లను పరిశీలిస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని భావిస్తూ సుదీర్ఘ కసరత్తి చేస్తుంది.

Congress Update News , Mahakutami Latest News , Congress seats  , Devara Konda, Tungaturthy, Mulugu ,Uttam kumar, Jana reddy

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *