ఆ ఇద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమేనా?

Congress Update news

· టీఆర్ఎస్ ను వీడనున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్

· హస్తం పార్టీలో చేరనున్నారంటూ ప్రచారం

ఎన్నికల ముందు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంపింగులు మామూలే. సాధారణంగా అధికారంలోకి వచ్చే పార్టీ వైపు అందరూ మొగ్గుతారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలోనూ నేతల జంపిగులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి నేతలు మారుతున్నారు. తాజాగా గులాబీ పార్టీకి ఇద్దరు ఎంపీలు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ప్రకటించాడు. దమ్ముంటే వారిద్దరినీ ఆపుకోవాలని టీఆర్ఎస్ కు సవాల్ కూడా చేశాడు. టీఆర్ఎస్ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్ పార్టీ మారనున్నారనే ప్రచారం ఎక్కువైన నేపథ్యంలోనే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టీఆర్ఎస్ వైఖరిపై కొండాకు అసంతృప్తి ఉందని, తనకంటే మంత్రి మహేందర్ రెడ్డికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఆయనకు నచ్చడంలేదని, అందువల్లే కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే బుధవారం ఆయన టీఆర్ఎస్ పరిస్థితి ఏమీ బాగోలేదంటూ వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల ఎంపీగా ఉన్న ఆయన.. తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్ఎస్ ఎదురీదుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ సైతం పార్టీ మార్పుపై యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. మొత్తమ్మీద త్వరలోనే ఈ ఇద్దరూ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది.

Congress Update news , Konda Vishveshwar Reddy and Sitaram Naik are join into the Congress Party , Telugu news update , Telugu news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *