కోదండరామ్ తో కేసీఆర్ కు కాంగ్రెస్ చెక్

Congress Update News

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి గులాబీ బాస్ ను ఓడించాలనే ఉద్దేశంతో చవకబారు రాజకీయాలకు తెరలేపారని కాంగ్రెస్ నాయకులపై హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మామను ఓడించాలని హరీష్ రావు తనకు చెప్పినట్టు ప్రమాణం చేసి మరీ చెప్తున్నా అని షాకింగ్ విషయాన్ని చెప్పిన వంటేరు ప్రతాప్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి హరీష్ రావు షాక్ ఇచ్చారు. కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి చవకబారు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు హరీష్. తన మామను ఎలాగైనా ఓడించాలని తనకు హరీష్ కాల్ చేశారని చెప్పిన వంటేరు హరీష్ రాహుల్ గాంధీ తో టచ్ లో ఉన్నారని చెప్పారు. మామా అల్లుళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని త్వరలో కాంగ్రెస్ లో చరటాడని చెప్పారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ వ్యాఖ్యలతో మళ్ళీ మామా అల్లుళ్ళ పంచాయితీ తెర మీదకు వచ్చింది. దీని పై స్పందించిన హరీష్ రావు గజ్వేల్ లో కేసీఆర్ గెలుపు ఖాయమని కేసీఆర్ గెలిచే వరకు తానూ అక్కడే ఉండి పని చేస్తానని కాంగ్రెస్ పార్టీ ను బొంద పెడతానని హెచ్చరించారు. వంటేరు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు కావాలని అడిగిన ఆయన కాంగ్రెస్ కుటిల ప‌న్నాగానికి గ‌ట్టి కౌంట‌రే ఇచ్చారు.
నేను ఫోన్ చేసిన‌ట్టు చెప్ప‌డం కాదు. ద‌మ్ముంటే ఆ ఆధారాలేంటో చూపించి మాట్లాడు కానీ గాలి వార్త‌లు చెప్ప‌కు! అని ఒంటేరుకు గ‌ట్టి కౌంట‌రే ఇచ్చారు. అంతేనా ఒంటేరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వార్డు మెంబ‌రుగా కూడా గెల‌వ‌లేని నీవు కేసీఆర్‌కు పోటీనా? ప‌్ర‌త్య‌ర్థి అత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీయాల‌న్న పన్నాగంలో భాగంగా ఇలాంటి నీతిమాలిన వ్యాఖ్య చేస్తున్న ఒంటేరు నిజాయితీ ఏంటో గ‌జ్వేల్ ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని హరీష్ చెప్పారు.
రాజ‌కీయాల్లో, అందునా ఎన్నిక‌ల వేళ గోబెల్స్ ప్ర‌చారం మంచిది కాద‌ని, అది మొద‌టికే మోసం అయ్యే అవ‌కాశం వుంద‌ని, ఇక నుంచైనా ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని విమ‌ర్శ‌లు చేస్తే మంచిద‌ని వార్నింగ్ ఇచ్చారు. త‌న పుట్టుక‌, చావు టీఆర్ ఎస్‌లోనే అని మ‌రోసారి స్ప‌ష్టం చేసిన హరీష్ వంటేరు వ్యాఖ్యలకు ఇచ్చిన కౌంటర్ తో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలినట్టయ్యింది.

Congress Update News, kodandaram latest  news , telugu news update , TJS political news , latest news on kodandaram.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *