కూటమిలో సీపీఐ రగడ ఆ ఒక్క సీటు కోసమే

cpi party latest news

ప్రజా కూటమిలో  సీట్ల పంచాయితీ రోజుకోరకమైన సిగపట్లకు కారణం అవుతుంది.   భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఫైనల్ కాలేదు. తాము అడిగిన స్థానాలు ఇవ్వకుంటే 9స్థానాల్లో పోటీ చేస్తామని స్థానాల లిస్టు ప్రకటించిన సీపీఐ తో చర్చలకు ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి వారు పట్టిన పట్టు విడవకుండా స్థానాలపై తమ డిమాండ్ చెప్పటంతో కాంగ్రెస్ సైతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది.              

సీపీఐ‌కు తాజాగా కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రతిపాదనలు ముందు పెట్టింది. దీంతో  కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్ధుబాటు విషయమై తాడో పేడో తేల్చుకోవాలని సీపీఐ నిర్ణయానికి వచ్చింది.  మంగళవారం నాడు సీపీఐ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయమై త్వరగా తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఈ సీట్ల వ్యవహారం తేల్చేందుకే  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. 40 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది.ఇక సీపీఐకు మూడు ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ స్థానాలను ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రతిపాదించింది. ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎమ్మెల్సీ స్థానాలను ఇవ్వనున్నట్టు  కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది. కానీ సీపీఐ మాత్రం నాలుగు ఎమ్మెల్యే స్థానాలకోసం పట్టు బడుతుంది. నాలుగు ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని సీపీఐ కోరుతోంది. కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. మరి కాంగ్రెస్ ఆ ఒక్క సీటు విషయంలో ఏం చేస్తుందో మరి వేచి చూడాలి.

cpi party latest news,cpi party leaders sensational comments on congress leaders,3 mla and 2 mlc seats for cpi party says uttam kumar reddy

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *