క్రికెట్ లో కొత్త రూల్స్ నేటి నుండి అమలు

CRICKET NEW RULES..
ఐసిసి క్రికెట్ లో స్ట్రిక్ట్ రూల్స్ ను నేటి నుండి అమలు చెయ్యనుంది. బాల్ ట్యాంపరింగ్, డక్ వర్త్ లూయిస్ సిస్టంతో పాటు కోడ్ ఆఫ్ కండక్ట్ కు సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ).. ప్లేయింగ్ నిబంధల్లో చేసిన మార్పులను విడుదల చేసింది. బాల్ ట్యాంపరింగ్ నిబంధనలను కఠినం చేసిన ఐసీసీ.. డక్ వర్త్ లూయిస్ నిబంధనలను సవరించింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 30 నుంచి అంటే నేటి నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం.. బంతి ఆకారం మార్చడాన్ని (బాల్‌ ట్యాంపరింగ్‌) ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 3 నేరంగా పరిగణిస్తారు. ఏ ఆటగాడైనా బాల్ టాంపరింగ్‌కు పాల్పడితే.. పెనాల్టీగా గతంలో 8 సస్పెన్షన్‌ పాయింట్లు విధించేవారు. దీనిని ఇప్పుడు 12 సస్పెన్షన్‌ పాయింట్లకు పెంచింది. క్రికెటర్లు స్లెడ్జింగ్ కు పాల్పడితే లెవల్‌ 1 నేరంగా పరిగణిస్తూ కొత్త నిబంధనను ప్రవేశ పెట్టింది. ఇక డీఎల్‌ఎస్‌ కు సంబంధించి ఇంతకు ముందు బాల్ టు బాల్ వచ్చే రన్స్ తో.. పవర్‌ ప్లేను పరిగణలోకి తీసుకొని… లిమిటెడ్‌ ఫార్మాట్‌లో విన్నర్ ను ప్రకటించేవారు. అయితే ప్రస్తుతం వన్డే, టీ20ల్లో బ్యాట్స్‌మెన్‌ చేసే పరుగుల సగటు మారిందని దీంతో ఈ పద్ధతిని కొంత మార్చినట్లు ఐసీసీ తెలిపింది.

12 SUSPENSION POINTS TO BALL TAMPERING, SLEDGING TREATS AS LEVEL -1 CRIME IN CRICKET

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *