అనుమానంతో అది కోసేసింది

Crime News

అనుమానంతో అది కోసేసింది

  • భర్తపై అనుమానంతో మర్మాంగాన్ని కోసేసిన భార్య
  • చైనాలో ఘటన

తన మొగుడు తనకే సొంతం కావాలనుకుంది. పరాయి మహిళలతో మాట్లాడినా సహించలేకపోయింది. తనను కాకుండా ఇతర మహిళలతో అతడు సన్నిహితంగా ఉంటున్నాడేమోనని అనుమానం పెంచుకుంది. అది అంతకంతకూ పెరిగి పెనుభూతమైంది. తన భర్త ఇతర మహిళల జోలికి వెళ్లకుండా ఉండటానికి ఒక్కటే మార్గమని భావించింది. అంతే.. అదనుచూసి అతడి మర్మాంగాన్ని కోసేసింది. చైనాలోని జియాంగ్సీ ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫెంగ్ చెంగ్ నగరంలోని ఓ అపార్ట్ మెంట్లో లీ అనే వ్యక్తి తన భార్యతో కలసి ఉంటున్నాడు. ఆమెకు భర్తపై తొలినుంచీ కాస్త అనుమానం ఎక్కువ. పరాయి మహిళలతో మాట్లాడకూదని, వారి ఫోన్ కాల్స్ సైతం ఆన్సర్ చేయకూడదని, కనీసం వారివైపు చూసి చిరునవ్వు కూడా నవ్వకూడదని సవాలక్ష ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ఆమెలో ఏదో ఒక మూల అనుమానం ఉండేది. ఈ క్రమంలో ఇటీవలే లీ కొత్త ఉద్యోగంలోకి మారాడు. దీంతో ఆమెలో ఈ అనుమానం మరింత ఎక్కవైపోయింది. కొత్త కంపెనీలో ఉన్న మహిళలతో తన భర్త రాసలీలలు నడుపుతూ తనను మోసం చేస్తున్నాడని కలత చెందింది. ఏమి చేయాలో అని ఆలోచించి ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. అతడి మగతనాన్ని తీసేస్తే ఇక ఎవరి జోలికి వెళ్లడు కదా అని భావించింది. అదను కోసం వేచి చూసింది. ఓ రోజు ఉదయం లీ బాత్ రూంలో ఉండగా లోపలకు వెళ్లి.. అతడి మర్మాంగాన్ని కట్ చేసి పడేసింది. ఊహించని ఘటనతో బిత్తరపోయిన లీ.. వెంటనే లబోదిబోమంటూ కిందపడి ఉన్న మర్మాంగాన్ని తీసుకుని ఆస్పత్రికి పరిగెట్టాడు. వైద్యులు ఎంతో శ్రమించి విజయవంతంగా దాన్ని తిరిగి అతికించగలిగారు. అయితే, అతడి లైంగిక జీవితానికి దాదాపు ముగింపు పడినట్టేనని చావుకబురు చల్లగా చెప్పారు. ఇకపై శృంగార జీవితాన్ని ఆస్వాదించడం కష్టమేనని పేర్కొన్నారు.

Wife’s Cut the Husband Penny, Women chops off, cheating husband, China Latest News, Telugu Breaking News, Crime News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *