క్వోరా డేటా చోరీ

Data was thefted from Kwara

  • ప్రమాదంలో పది కోట్ల మంది వివరాలు
  • పాస్ వర్డ్ లు మార్చుకోవాలని సంస్థ సూచన

పది కోట్ల మంది డేటా ప్రమాదంలో పడిందా? ప్రముఖ వెబ్ సైట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ (క్వోరా) సైట్ హ్యాకింగ్ గురై వినియోగదారుల సమాచారం చోరీకి గురైందా? ఫేస్‌బుక్‌లో డేటా లీక్‌ ఉదంతం ప్రకంపనలు ఇంకా సమసిపోకముందే తాజాగా జరిగిన ఈ డేటా బ్రీచ్‌ తీవ్రంగా ఆందోళన రేకెత్తిస్తోంది. తమ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైందని స్వయంగా క్వోరా వెల్లడించింది. అందువల్ల క్వోరా ఖాతాదారులు వెంటనే పాస్ వర్డ్ లు మార్చుకోవాలని సూచించింది. అలాగే హ్యాకింగ్‌కు గురైన వినియోగదారులకు సమాచారం ఇస్తున్నట్టు తెలిపింది. సుమారు 10కోట్ల మంది వినియోగదారుల డేటా చోరీ అయిందని పేర్కొంది. గుర్తు తెలియని  హ్యాకర్లు థర్డ్ పార్టీ సైట్ ద్వారా తమ సైట్ లోకి చొరబడి డేటా చోరీ చేశారని వివరించింది. నవంబరు 30న దీన్నిగుర్తించామని వెల్లడించింది. పేరు, ఈమెయిల్ చిరునామా, ఎన్‌క్రిప్టెడ్ పాస్ వర్డ్ లు, లింక్డ్ నెట్‌వర్క్ లో రిపోర్ట్‌ చేసిన డేటాతో సహా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించారని క్వోరా కంపెనీ సీఈవో ఆడమ్‌ డీ ఎంజేలో తన వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందన్నారు. వినియోగదారులు వెంటనే తమ పాస్ వర్డ్ లు మార్చుకోవాలని స్పష్టంచేశారు. ఫేస్‌బుక్‌  మాజీ ఉద్యోగులు ఆడమ్‌ డీఎంజేలో, చార్లీ చీవర్‌ 2009లో క్వోరా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశారు.  సోషల్‌ మీడియాలో సహా పలు రంగాల్లోని ప్రశ్నలకు జవాబు అందించేలా దీన్ని అభివృద్ధి చేశారు. అతితక్కువ కాలంలోనే ఈ వెబ్‌సైట్‌ అత్యంత ఆదరణ పొందింది.

Every One read Bhagavad Gita Check out here

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *