సరైన కథ దొరికితే 3.0

Director Shanker Latest News

  • 2.0 సీక్వెల్ పై దర్శకుడు శంకర్ స్పందన

సరైన కథ దొరికితే 2.0 కి సీక్వెల్ తీస్తానని గ్రేట్ డైరెక్టర్ శంకర్ వెల్లడించారు. అయితే, సీక్వెల్ తీయాలి కాబట్టి ఏదో ఒకటి తీయబోనని, సరైన కథ దొరికినిప్పుడు 3.0 తీస్తానని స్పష్టంచేశారు. రోబో కి కొనసాగింపుగా తీసిన 2.0 విజయవంతమైన నేపథ్యంలో దీనికి సీక్వెల్ వస్తుందా అనే చర్చ గత కొన్నిరోజుగా సాగుతోంది. పైగా సినిమా ముగింపు కూడా ఓపెన్ ఎండింగ్ గా ఉండటంతో అందరూ దాని గురించే చర్చించకున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఓ వెబ్ సైట్ శంకర్ ను ప్రశ్నించింది. 2.0కి సీక్వెల్ వస్తుందా అని అడిగింది. అందుకు ఆయన సానుకూలంగానే స్పందించారు. సీక్వెల్‌ తీయాలి అనుకుంటున్నాం కాబట్టి ఏదో ఒకటి తీయనని, సరైన కథ దొరికితేనే చేస్తానని చెప్పారు. ‘నా సినిమాలు ఓపెన్‌ ఎండింగ్‌గా ఉంటాయి.. తర్వాతి భాగానికి తారాగణం కూడా అందుబాటులోనే ఉంటుంది. నేను దీన్ని ముందే ప్లాన్‌ చేసుకోలేదు. సహజంగా జరిగిపోతుంటాయి. నాకు ఐడియా వస్తే ‘3.0’ తీస్తా. ఏదో సీక్వెల్‌ తీయాలి కదా.. అని తీయడం నాకు ఇష్టం లేదు. సరిపోయే స్క్రిప్టు దొరికితే.. అదే తెరకెక్కుతుంది’ అని శంకర్‌ పేర్కొన్నారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన 2.0 త్రీడీ వెర్షన్ ఘన విజయం సాధించింది. తొలుత ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వ్యక్తమైనప్పటికీ, వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లు రాబట్టింది. కాగా, శంకర్‌ ప్రస్తుతం ‘భారతీయుడు 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. సూపర్ హిట్ సినిమా ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, కాజల్ నాయికా నాయకులుగా నటిస్తున్నారు.

Director Shanker Latest News , 2.0 Latest news, Telugu Latest Movie 2.0 , Telugu movie News, Shanker Update news, Telugu Movie

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *