తల్లి గెలుపు కోసం తనయ ప్రచారం … దూసుకుపోతున్న డీకే అరుణ కుమార్తె

DK Aruna Daughter Latest news

 

రాజకీయాలు కూడా వారసత్వమే అనే స్థితిలో ఉన్నాయి ప్రస్తుత మన రాజకీయాలు. రాజకీయాల్లోకి కొత్త వాళ్ళు వస్తే నిలబడటం కష్టమే. అక్కడ కూడా ఎవరో ఒకరు వెన్ను దన్నుగా లేకుంటే మనుగడ సాగించలేము. అలాంటి పరిస్థితి లో ఈ సారి ఎన్నికల్లో టికెట్ కోసం రాజకీయ వారసులు చాలా మందే తిప్పలు పడ్డారు. టీఆర్ఎస్ నుండి అటు కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున రాజకీయ వారసులు టికెట్ ఆశించారు. కానీ ఒకరిద్దరు మినహాయించి ఇంకెవరు టికెట్ తెచ్చుకోలేకపోయారు. దీంతో అసంతృప్తి తో ఉండి యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొనలేని వారు చాలా మందే వుంటే టికెట్ రాకున్నా పార్టీ గెలుపు కోసం ఊరూరు గిరగిరా తిరుగుతున్న అమ్మాయి ఒకరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.
రాజ‌కీయాల్లోకి వార‌సులు రావ‌డం కొత్త కాదు. తండ్రులు నాయ‌కులు అయితే అబ్బాయిలు క‌చ్చితంగా రాజ‌కీయాల్లోనే ఉంటారు. చాలా కొద్దిమంది విష‌యంలోనే ఇది జ‌ర‌గ‌లేదు. కానీ త‌ల్లి రాజ‌కీయ వార‌స‌త్వం తీసుకున్న వారు త‌క్కువే. పైగా కూతుర్లు ఇంకా త‌క్కువ‌. సాధార‌ణంగా ఇంకో ఇంటి కోడ‌లి అవుతుంది కాబ‌ట్టి వారికి రాజ‌కీయ వార‌స‌త్వం అప్ప‌గించ‌డానికి కూడా పెద్ద‌గా ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఫైర్‌బ్రాండ్ డి.కె. అరుణ కూతురు మాత్రం త‌ల్లి రాజ‌కీయాల్లో బాగా యాక్టివ్‌గా ఉండ‌గానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసింది.తనదైన దూకుడుతో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తుంది.
ప్ర‌స్తుతం తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గా ఉన్న ఆమె పేరు స్నిగ్దారెడ్డి. రాజ‌కీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. త‌ల్లి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఫుల్ స్వింగ్‌లోఉన్న స్నిగ్దారెడ్డి త‌ల్లి నామినేష‌న్ వేసేలోపు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామంలో ఒక రౌండ్ ప్ర‌చారం అపుడే పూర్తి చేసేసింది. వాస్త‌వానికి ఆమెను మ‌క్త‌ల్ నుంచి అభ్య‌ర్థిగా నిల‌బెట్టాల‌ని డీకే అరుణ‌ చాలా ట్రై చేసింది. కానీ నెర‌వేర‌లేదు. అయినా సరే ఏ మాత్రం నిరుత్సాహం లేకుండా త‌ల్లి కోసం తెగ‌తిరుగుతోంది స్నిగ్ధా రెడ్డి .
మొత్తానికి చాలా మంది నాయ‌కుల‌కు లేని సౌల‌భ్యం డికె అరుణ‌కు దక్కింది. ఆమె ప్రచారానికి తిరగక పోయినా కూతురే తల్లి కోసం ప్రచారం నిర్వహించి త‌ల్లిని గెలిపించుకుని గ‌ద్వాల రాణిగా నిల‌బెట్టేలా ఉంది. అంతేనా తనకు టికెట్ ఇవ్వకున్నా పార్టీ పట్ల తనకు ఉన్న కమిట్మెంట్ ఏంటో తెలిసేలా పని చేస్తూ పార్టీ ముఖ్య నాయకుల మన్ననలు పొందుతుంది

DK Aruna Daughter Latest news , Congress Latest news, Dk Aruna Daughter Snigda Reddy , Snigda Reddy Campaign for her mother,  Telugu news #tsnews, #tsnewschannel

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *