ఎలక్షన్ వార్ … నిర్మల్ లో ఉద్రిక్తత

Election War in Nirmal

ఎన్నికలకు మరి కొన్ని గంటలే సమయం ఉన్న నేపధ్యంలో నిర్మల్ లో పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. ఒక పార్టీ నేతల మీద మరో పార్టీ నేతల దాడులతో నిర్మల్ లో శాంతి భద్రతలకు విగాటం కలుగుతుంది. నిర్మల్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకొంది. నివురు గప్పిన నిప్పులా నిర్మల్‌లో పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకొంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు తమ మీద దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ దాడిని నిరసిస్తూ టీఆర్ఎస్ కు చెందిన నేత కారును కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు పార్టీల మధ్య ఘర్షణతో నిర్మల్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీఆర్ఎస్‌ కార్యకర్తల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకొన్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.ఇరువర్గాల దాడులతో నిర్మల్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

Election War in Nirmal  , War Between Congress Leaders and TRS leaders in Nirmal, Telugu news, Telugu Update news, Nirmal Update news 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *