కాంగ్రెస్ షాక్ ఇచ్చి కారెక్కిన మాజీ మంత్రి

Ex Minister given shock to Congress

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు కొత్త రాజకీయ సమీకరణాలకు కేంద్రం అవుతున్నాయి. అసలు ఏ నేత ఏ పార్టీలో ఉంటారు.. ఏ నేల ఏ పార్టీలో చేరుతారు.. వంటివి ఊహించడం కష్టంగా మారింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకు పార్టీలలో టికెట్ ఆశించి భంగపడిన వారు.. ఆయా పార్టీలకు గుడ్‌బై చెప్పేసి, వేరే పార్టీల్లోకి జంప్ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత ఏమీ ఆశించకుండానే పార్టీ మారబోతున్నారు. ఆయన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జలగం ప్రసాదరావు. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తన అనుచరుల కోరిక మేరకు భవిష్యత్‌పై దృష్టి సారించారు. అందుకే మరోసారి రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన టీఆర్ఎస్ ఎంచుకున్నారని సమాచారం
1999లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి సుధాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆ ఎన్నికల్లో పని చేశారన్న కారణంతో ప్రసాదరావుపై కాంగ్రెస్‌ అధిష్టానం ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. వాస్తవానికి ఆ గడువు 2005లోనే తీరినా.. జలగం కాంగ్రెస్‌లో చేరడానికి పెద్దగా సుముఖత చూపకపోవడం.. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండా తటస్థంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేసినా.. ఆ పార్టీ నేతలు ఆయనను కావాలని పక్కన పెట్టేశారు. దీంతో ఆయన టీఆర్ఎస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ వార్త కొద్దిరోజులుగా ప్రచారంలోకి రావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం శుక్రవారం ఆయనపై బహిష్కరణ వేటును ఎత్తివేసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ ఏ.కె ఆంటోనీ సమాచారం అందజేశారు. అంతేకాదు, దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ ఫోన్‌ చేసి చెప్పినప్పటికీ జలగం ప్రసాదరావు వెనక్కి తగ్గనట్లు చెబుతున్నారు.

Ex Minister given shock to Congress , Jalagam Parasad Rao, Jalagam Parasad Rao Joins TRS Party . Trs Party latest News, telugu News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *