రాహుల్ డీఎస్ ను దూరం పెట్టారెందుకు

ఆయన ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత .. కానీ ఇప్పుడు ఏ పార్టీ లో ఉండాలో , ఎటు పోవాలో అర్ధం కాక  ప్రభావాన్ని కోల్పోయిన నేత. ఒకప్పుడు పీసీసి అధ్యక్ష హోదాలో పని చేసిన ఆనేతకు ఇప్పుడు రాహుల్ గాంధీ  నుండి పిలుపు దూరమైంది. నమ్మి చేరిన టీఆర్ఎస్ పార్టీ నట్టేట ముంచింది. పలు విధాలుగా అభాసు పాలైన ఆ నేత మరెవరో కాదు మాజీ పీసీసీ అధ్యక్షుడు డీఎస్.  

    కాలం క‌లిసి రాక‌పోతే ఎంత పేరున్నా..ఎంత అనుభ‌వం వున్నా ఏం లాభం..  చెప్పండి. ఇప్పుడు అవిభాజ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ పీసీసీ అధ్య‌క్షుడు డీఎస్ ప‌రిస్థితి అదే..  నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా కాంగ్రెస్‌ లో కొనసాగి అన్ని కీలక పదవులు అనుభవించిన ఆయన తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పీసీసీ అధ్య‌క్షుడిగా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. తెలంగాణ‌లో బ‌ల‌మైన నేత‌గా ఎదిగిన ఆయ‌న తెలంగాణ ప్ర‌త్యే రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత  టీఆర్ఎస్ లో చేరారు. ఇక్క‌డి నుంచి ఆయ‌న‌కు రాజకీయంగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది . .

   త‌న‌యుల కార‌ణంగా జిల్లాలో రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న డీ. శ్రీ‌నివాస్  త‌ద‌నంత‌ర ప‌రిణామాల కార‌ణంగా టీఆర్ఎస్ ఎంపీ కల్వ‌కుంట్ల క‌విత ఆగ్ర‌హానికి గుర‌య్యారు. తనయులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపధ్యంలో కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఆయన జిల్లాలో అన్ని విధాలా ఇబ్బందికర పరిణామాలు యెఉర్కొన్నరు. జిల్లాలో పార్టీకి వ్య‌తిరేకంగా పావులు క‌దుప‌తున్నార‌న్న అప‌వాదు కార‌ణంగా గులాబీ బాస్ కు  దూర‌మై డీఎస్ మ‌ళ్లీ సొంత గూటికి చేరాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన డీఎస్ రాహుల్ గాంధీతో స‌మావేశ‌మ‌య్యారు. అయినా ఆయ‌న కాంగ్రెస్‌లోకి రీఎంట్రీపై ఎలాంటి స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో డీఎస్‌ని రాహుల్ క‌నిక‌రించ‌లేద‌ని ఆయ‌న స‌న్నిహితులే గుస‌గుస‌లాడుతున్నారు. ఒక పక్క కుమారునిపై కేసులు, మరో పక్క ఆయన పార్టీ లోకి వచ్చినా జిల్లాలో ఒనగూరే ప్రయోజనం ఏమి లేదు అన్న భావనలోనే రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించలేదని సమాచారం.

     అయితే డీఎస్ అనుచ‌ర‌గ‌ణం అంతా పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్‌కుమార్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. కానీ డీఎస్‌కు మాత్రం పిలుపు రావ‌డం లేదు. అంతే కాకుండా డీఎస్ తెరాస‌ను వీడితే ఆయ‌న‌కున్న ఎంపీ ప‌ద‌వి ఊడే ప్ర‌మాదం వుంది. రాహుల్ గ్రీన్ సిగ్నల్  ఇస్తే పార్టీ నుండి జంప్ అవుతారు కానీ ఆయన డీఎస్ కి ఓకే చెప్పటం లేదు . కాంగ్రెస్‌లో చేరిక‌పై డీఎస్ ఇంకా తాత్సారం చేస్తే రెంటికి చెడ్డ రేవ‌డిలా మారే ప్రమాదం ఉంది. మరి డీఎస్ ఏం చేస్తాడో వేచి చూడాలి .

ex pcc cheif d srinivas latest news,congress chief rahul gandi not caring about d srinivas,congress leaders sensational comments on d srinivas

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *