గాలి ఇంటి గోడలలో రహస్య లాకర్లు

gaali janardhan latest news

ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి రూ.600 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈడీ కేసు నుంచి కాపాడేందుకు రూ.18 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ వచ్చిన ఆరోపణ నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో కనిపించకుండాపోయిన గాలి ఆచూకీ కోసం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా గాలి జనార్ధన్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. గాలి ఇంట్లో గోడల మధ్యలో రహస్య లాకర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాలి జనార్ధన్‌రెడ్డి అసిస్టెంట్ అలీఖాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా లభ్యమైనట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. దాదాపు రెండు రోజులు గడిచినా గాలి ఎక్కడుంది తెలియకపోవడంతో మాల్యా మాదిరిగా దేశం విడిచి పారిపోయి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈడీ కే లంచం ఇచ్చి అడ్డంగా బుక్కైన గాలి నేలమాళిగలలో ఇంకేం దాచారో … ఇంకెంత దేశాన్ని దోచారో అన్న చర్చ జోరుగా సాగుతుంది.

gaali janardhan latest news,secret lockers on walls,secret lockers on walls at gaali janardhan reddy home,ccb police is searching for gaali janardhan reddy

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *