గజ్వేల్ బరిలో గద్దర్ … ఇండిపెండెంట్ గా కేసీఆర్ పై పోటీ

gaddhar latest news

సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని గత కొంత కాలంగా గద్దర్ చెప్తున్న విషయం తెలిసిందే.  ఈ ఎన్నికల్లోనే ఓటు హక్కు నమోదు చేసుకున్న గద్దర్ రాష్ట్రంలో అనివార్య పరిస్థితుల నేపధ్యంలో తానూ ఎన్నికల బర్లోకి రానున్నానని సంచలన ప్రకటన చేశారు. అయితే మహాకూటమి నుండి టికెట్ ఆశించిన ఆయనకు  రాహుల్ మొండి చెయ్యి ఇవ్వటంతో గజ్వేల్‌ నుండి తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రజా యుద్ద నౌక గద్దర్ ప్రకటించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని ఆయన తేల్చి చెప్పారు.

       ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తనకు భద్రత కల్పించాలని  సీఐడీ డీజీని కోరినట్టు గద్దర్ తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత  రాజరికపు పాలన కొనసాగిందని గద్దర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్దరించబడాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

ఈ నెల 15 నుండి తెలంగాణలోని ప్రతి పల్లెకు వెళ్లి ప్రచారం నిర్వహించనున్నట్టు గద్దర్ ప్రకటించారు. అవినీతి కంటే రాజకీయ అవినీతి చాలా ప్రమాదకరమైందని గద్దర్ అభిప్రాయపడ్డారు.అన్ని పార్టీలు మద్దతిస్తే తాను గజ్వేల్‌ నుండి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని గద్దర్ గతంలో ప్రకటించారు. అయితే గజ్వేల్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఒంటేరు ప్రతాప్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ ను గద్దర్ కలిసిన సమయంలో గజ్వేల్ నుండి బరిలోకి దిగే విషయాన్ని ప్రతిపాదన పెట్టినా….. కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో గద్దర్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

gaddhar latest news,telangana singer gaddhar contesting as mla in telangana,gaddhar contesing mla from gajwel constutiency

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *