టీఆర్ఎస్ మాజీమంత్రి రాజయ్యకు ప్రజల షాక్

Ganapur Political News

ఆ గులాబీ దళ అభ్యర్థికి ప్రజలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తున్నారు. ఒక పక్క అసమ్మతి, మరోపక్క ప్రజల అసంతృప్తి వెరసి ఆ గులాబీ పార్టీ అభ్యర్థికి తిప్పలు తప్పటం లేదు. ప్రచారానికి కూడా పోలీసుల భద్రత తప్పనిసరిగా మారింది. మరి ఇలాంటి పరిస్థితిలో ఆ తాజా మాజీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి గెలుస్తాడా అంటే కూటమి నుండి బలమైన నాయకుడు రంగంలోకి దిగితే కష్టమే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
వరంగల్ అర్బన్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ టీఆర్‌‌ఎస్ అభ్యర్థికి జనం షాకిచ్చారు.స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గం పరిధిలోని ధర్మసాగర్ మండలం కరుణపురం గ్రామంలో ప్రచారానికి వెళ్లిన తాటికొండ రాజయ్యను స్థానికులు అడ్డుకున్నారు. కరుణపురం, పెద్ద పెండ్యాల గ్రామాలకు నువ్వేం చేశావని ప్రశ్నించారు. మా గ్రామాలకు రావొద్దు, నీకెందుకు మేం ఓట్ల వేయాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఫాదర్ కొలంబో పేరుతో వందలాది ఎకరాల భూమని ప్రభుత్వానికి ధారాదత్తం చేశావంటూ నిలదీశారు. ఈ సారి ఓడించడం ఖాయమని హెచ్చరించారు. దీంతో పోలీసులు, టీఆర్‌ఎస్ నేతలు వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఉద్రిక్తత చోటు చేసుకోకుండా అడ్డుకున్నారు.
స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య ఎక్కడకి వెళ్ళినా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. మరో పక్క సహకరిస్తానని చెప్తున్నా కడియం శ్రీహరి ఏ మాత్రం సహకరించటం లేదు అని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. వరుస షాకులతో రాజయ్య ఆందోళన చెందుతున్నారు. ప్రజా క్షేత్రంలో అనునిత్యం ఎదురీదుతున్న రాజయ్య కు వ్యక్తం అవుతున్న వ్యతిరేఖత చూస్తే ఈ సారి ఎన్నికల్లో రాజయ్యకు దెబ్బ పడటం ఖాయంగా కనిపిస్తుంది.

Ganapur Political News, Station Ganapur People given Shock News To EX Minister Thatikonda Rajaiah, Dharmasagar , Karunapuram

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *