బంగారం కొంటున్నారా ? తస్మాత్ జాగ్రత్త

Gold News

దీపావళికి రెండు రోజుల ముందు జరిగే ధన త్రయోదశి కోసం వ్యాపారులు రకరకాల ఆఫర్లు, స్కీమ్‌లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయా వ్యాపార సంస్థల్లో తూనికలు కొలతల శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
వ్యాపారులు వినియోగదారులకు సరైన ధర, తూకంతో నగలు అమ్ముతున్నారా? లేదా అన్న విషయాలను తెలుసుకోవడంతోపాటు నిబంధనలను పాటిస్తున్నారా? లేదా అని తెలుసుకునేందుకు తూనికలు కొలతలశాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌… ముగ్గురు డిప్యూటీ కంట్రోలర్స్‌, ఐదుగురు అసిస్టెంట్‌ కంట్రోలర్స్‌ల నేతృత్వంలో 30 మంది అధికారులతో 9 బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తే షాకింగ్ నిజాలు వెలుగు చూసాయి. అనేక మంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారంచేస్తూ కొనుగోలు దారులను మోసం చేస్టున్నట్టు తనిఖీల్లో తేలిందని అధికారులు తెలిపారు. పలు సంస్థలపై 85 కేసులు నమోదు చేశారు.
బంగారం వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి ప్రజలను దోచుకుంటున్నారు. మేకింగ్‌, వేస్టేజీపై కూడా వ్యాట్‌ వేస్తూ దోపిడీకి తెరతీసారు. నికర బరువు ప్రకారమే వ్యాట్ వేయాలి. కానీ ఆ రూల్ చాలా షాపుల్లో పాటించటం లేదు. వినియోగదారులు కొనుగోలు చేసిన నగలకు దుకాణ దారులు ఇచ్చే బిల్లులో కచ్చితంగా బంగారం నాణ్యత, బరువు, ఆభరణాల్లో వాడిన స్టోన్‌ బరువు, ధర విడివిడిగా బిల్లులో చూపించాలి. కొనుగోలు చేసిన రోజు ఉన్న బంగారం ధరతోపాటు 22 కేరట్లు, 24 కేరట్లా అన్నది స్పష్టంగా పేర్కొనాలి. కానీ కస్టమర్లకు అర్ధం కాని రీతిలో బిల్ల్స్ వేస్తూ ఆ చార్జీలు, ఈ చార్జీలు అని వీర బాదుడు బాదుతున్నారు. ఇక వేస్టేజ్ అయితే 25% తీసేస్తూ కస్టమర్లను దోచేస్తునారు. ఇలా మోసం చేస్తున్న షాపులపై అధికారులు కొరడా ఝుళిపించటం విషయం అటుంచి కస్టమర్లకు కూడా బంగారం కొనుగోలు చేసేందుకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బిల్ల్స్ చెక్ చేసుకోవాలి. నికర బరువుకు వ్యాట్ వేస్తున్నారా లేదా తరుగు వేస్టేజ్ లతో కలిపి వ్యాట్ వేస్తున్నారా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఏ ఆభరన్ననికి ఎంత అత్రుగు వరకు సమంజసమో తెలుసుకోవాలి. లేదంటే ఇష్టారాజ్యంగా తరుగు రాసి దోపిడీ చేసే ప్రమాదం వుంది. కనుక బంగారం కొంటే తస్మాత్ జాగ్రత్త .

Gold News ,Diwali Latest News, Gold latest News, Telugu Update News, Telugu News, telugu Breaking News, telugu news update

Gold News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *