శారిడాన్ ఇక కనిపించదు

Govt Bans Saridon

  • 328 రకాల ఔషధాలపై కేంద్ర నిషేధం

ఒకటే శారిడాన్.. ఇక ఉండదు తలనొప్పీ.. బాధా, నొప్పీ మటుమాయం.. ఒకటే శారిడాన్.. అంటూ వచ్చిన ప్రకటన మనకు గుర్తుండే ఉంటుంది. ఇకపై ఈ ప్రకటన కనిపించదు. ఈ ఔషధం వాడకం హానికరమని పేర్కొంటూ శారిడాన్ పై కేంద్రం నిషేధం విధించింది. శారిడాన్ సహా 328 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్ డీసీ) డ్రగ్స్ ను తయారుచేయడం, విక్రయించడం తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. శారిడాన్‌తో పాటు చర్మ వ్యాధులకు వాడే పాన్ డెర్మ్, ఆల్కెం ల్యాబోరేటరీస్‌కు చెందిన టాక్సిమ్‌ ఏజెడ్‌, మెక్లోడ్స్‌ ఫార్మా పండెమ్‌ ప్లస్‌ క్రీమ్‌లను కూడా ప్రభుత్వం నిషేధించింది. వివిధ కంపెనీలు దాదాపు 6000 బ్రాండ్లతో ఈ ఔషధాలను అమ్ముతున్నాయి. ఏటా రూ.2వేల కోట్ల నుంచి రూ.2,500 కోట్ల మేర వీటి టర్నోవర్ ఉంటోంది. ప్రజల ఆరోగ్యానికి హానికరమని పేర్కొంటూ 2016లో మార్చి 10న కేంద్ర ప్రభుత్వం 349 ఎఫ్‌డీసీలను నిషేధించింది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 చట్టంలోని సెక్షన్ 26A ప్రకారం వాటిపై నిషేధం విధించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఫార్మా కంపెనీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీంతో గత ఏడాది డిసెంబరులో ఈ ఔషధాల విషయాన్ని పరిశీలించాల్సిందిగా డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్ (డీట్యాబ్)ను సుప్రీంకోర్టు కోరింది.  ఆ మేరకు పరిశీలన జరిపిన కమిటీ .. వాటిలో 328 ఎఫ్‌డీసీ ఔషధాలు హానికరమని నివేదిక ఇచ్చింది. వాటిపై నిషేధించడం విధించడం సరేనని తేల్చింది. ఇవి వాడటం వల్ల ప్రజల ఆరోగ్యానికి మరింత నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఎఫ్‌డీసీల తయారీని, విక్రయాలను,పంపిణీని నిరోధించడం అవసరం అని డీట్యాబ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రభుత్వం, ఔషద తయారీ సంస్థల మధ్య జరుగుతున్న న్యాయ యుద్ధం ముగిసినట్లయ్యింది. కాగా, నిషేదానికి గురవుతాయని భావించిన ప్రముఖ ఔషదాలు డీకోల్డ్ టోటల్, కొరెక్స్ దగ్గు మందు, పెన్సిడైల్ కాఫ్ లింక్టస్‌లకు ఉపశమనం లభించడం గమనార్హం.

 Is Saridon safe?,Govt Attack On Drugs,Govt Bans 328 Drugs,Saridon Is Injured On Health,Why Govt Ban Saridon Tablet,Health Latest News,Telugu Latest News, Pharma Companys Appeal And Sawal To Supreem Court,Health Produst 328 Baned,Side Effect Of Saridon,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *