హరీష్ పై వ్యాఖ్యలకు క‌ట్టుబ‌డి ఉన్నా

harish rao news

తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ హరీష్‌రావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో హంగ్ దిశగా ఫలితాలు వస్తే  టీఆర్ఎస్‌ నుండి కొందరిని చీల్చి ప్రజా కూటమి సహయంతో హరీష్‌రావు సీఎం అయ్యేందుకు వ్యూహంతో ఉన్నారని రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్‌లో హరీష్‌రావును అవమానిస్తున్నారని కూడ  ఆయన అభిప్రాయపడ్డారు.ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు సోమవారం నాడు మండిపడ్డారు.  తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి నాలుక కోస్తానని హెచ్చరించాడు.ఇదిలా ఉంటే హరీష్‌రావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని  రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. తన నాలుక కోస్తానని వ్యాఖ్యానించిన మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు చేయాలని రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

harish rao news,telangana irrigation minister harish rao latest news,tdp leader revuri prakash sensational comments on harish rao

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *