హ‌రీశ్ ఎందుక‌లా..?

Harish Shanker

డీజే దువ్వాడ జ‌గ‌న్నాథమ్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌తో… `దాగుడు మూత‌లు` అనే మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీయ‌డానికి దిల్‌రాజు రెడీ అయ్యారు. అయితే స్క్రిప్ట్ న‌చ్చ‌లేద‌నే కార‌ణంతో ప్రాజెక్ట్‌ను ప‌క్క‌న పెట్టేశాడు. హ‌రీశ్ శంక‌ర్ ఈ ప్రాజెక్ట్‌ను మరొక‌రితో రూపొందించాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలేవీ స‌క్సెస్ కాలేదు. దీంతో హ‌రీశ్ రూట్ మార్చాడు. ఓ త‌మిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంట‌న్నారు. ఆ త‌మిళ సినిమా ఏదో కాదు జిగ‌ర్ తండా. కార్తీక్ సుబ్బరాజ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, బాబీ సింహ‌, లక్ష్మీమీన‌న్ కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రం చిక్క‌డు దొర‌క‌డు పేరుతో తెలుగులో అనువాద‌మై విడుద‌లైంది కూడా. మ‌రిప్పుడు ఈ సినిమాను హ‌రీశ్‌ తెలుగులో రీమేక్ చేయాల‌నుకోవ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టో తెలియ‌డం లేదు మ‌రి.

Director Harish  Shaker after DJ telugu movie , started New Movie Dagudu Mutalu telugu Movie, Director Harish  Shaker and Dill Raju  Started New Telugu movie  Dagudu Mutalu,

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *