బాలయ్య ఔదార్యానికి షాక్ అయిన మురళీ మోహన్

సినీ పరిశ్రమలో విలక్షణమైన వ్యక్తి బాలకృష్ణ . నటనలోనే కాదు సహాయం చెయ్యటంలోనూ బాలయ్య స్టైలే వేరు. ఆయన మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా స్పందించరు. కోపం వస్తే మాత్రం ఊరుకోరు. అలాంటి విభిన్నమైన వ్యక్తిత్వం ఉన్న బాలయ్య చాలా సహృదయం ఉన్న వ్యక్తి. ఎవరికైనా సాయం చేసే విషయంలో ఆయన నిముషం కూడా ఆలోచించడు.  బాలయ్య దానగుణం పై సినీ ఇండస్ట్రీ లో చాలా చర్చలు జరిగాయి. తన వద్దకు వచ్చిన దాదాపు అందరికీ సాయం చేస్తూ ఉంటారని టాక్ ఉంది.

తన తల్లి జ్ఞాపకార్ధం కట్టించిన బసవతారకం ఆస్పత్రిలో ఎందరో క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారు బాలకృష్ణ. ఇటీవల ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఒకరు సహాయం కావాలని బాలయ్య కాళ్ళ మీద పడితే అతని బాధ తెలుసుకున్న బాలయ్య బసవతారకం ఆస్పత్రికి ఆయన్ను పంపించారు. క్యాన్సర్ తో బాధ పడుతున్న ఆ వృద్దుడికి వైద్యం చెయ్యాలని చెప్పారు.  గత ఏడాది ఒక యువకుడు రక్త క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షలు సాయం చేసారు. అలాగే తాను పది లక్షలు సాయం చేసారు. తాజాగా తిత్లీ తుఫాన్ బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల చెక్ ని అందించారు.

తాజాగా బాలయ్య దానగుణం చూసి మురళీ మోహన్ షాక్ కు గురయ్యారని టాక్.  బాలకృష్ణ ఎప్పుడో హైదరాబాద్ లోని బాలనగర్ లో ఒక స్థలం కొనుక్కున్నారట. అయితే ఆ స్థలాన్ని  మురళి మోహన్ తాను కొనుక్కుంటాను తనకు అమ్మాలని అడిగారట. ఇద్దరు వెళ్లి స్థలాన్ని చూశారట. ఆ సమయంలో అక్కడ కొంత మంది పేదలు గుడిసెలు వేసుకుని ఉండటాన్ని గమనించిన బాలయ్య పేదలు నివసిస్తున్నారు కదా… వాళ్ళను ఉండనిద్దాం.. ఆ స్థలం అమ్మటం నాకు ఇష్టం లేదు అని  చెప్పారట. విన్న మురళీ మోహన్ షాక్ తిన్నాడట. ఇంత దయాగునానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనని ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

hero balakrishna news,tollywood hero balakrishna latest news,tdp mp murali mohan latest news,balakrishna sensational cooemnts on murali mohan,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *