చందుపై న‌మ్మ‌కంతో ఆలోచించ‌లేదు – నాగ‌ చైతన్య

నాగ చెతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’ చందు మొండేటి దర్శకుడు. నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) నిర్మాతలు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా నాగ‌ చైతన్య ఇంటర్వ్యూ…
జ‌ర్నీ ప్రారంభం….
– నార్వేలో ప్రేమ‌మ్ షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు చందు స‌వ్య‌సాచి లైన్‌ను ఐదు నుండి ప‌ది నిమిషాలు వివ‌రించారు. లైన్ బావుంది కానీ.. మ‌రి ఎక్స్‌పెరిమెంట్ అయిపోతుందేమోన‌నిపిస్తుంద‌ని త‌న‌తో చెప్పాను. త‌ను హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ ప్యాట్ర‌న్‌లో క‌థ‌ను రాసుకుని వివ‌రించారు. న‌చ్చ‌డంతో నిర్మాత‌ల‌కు చెప్పాం.. వారికి న‌చ్చ‌డంతో సినిమా జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది.
చందు ద‌ర్శ‌క‌త్వంలో…
– నేను ప‌నిచేసిన ద‌ర్శ‌కుల్లో చందు మొండేటి నా వ‌ద్ద‌కు వ‌చ్చి మీతో ఇంకో సినిమా చేయాల‌నుంద‌ని చెప్పాడు. ఓ ద‌ర్శ‌కుడు అలా న‌న్ను అడ‌గ‌డం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. త‌ను క‌థ‌ను ఆలోచించే తీరు బావుంటుంది. ఉదాహ‌ర‌ణ చెప్పాలంటే `ప్రేమ‌మ్‌` సినిమా చేసేట‌ప్పుడు ఆ సినిమా రీమేక్ చేయ‌వ‌ద్ద‌ని చాలా మంది అన్నారు. అయితే చందు అర్థం చేసుకుని మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గిన‌ట్లుగా క‌థ‌ను మ‌లిచి తెర‌కెక్కించి నాకొక సూప‌ర్‌హిట్ మూవీ ఇచ్చాడు. నా దష్టిలో తను న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్. ఈ సినిమా కూడా డిఫ‌రెంట్‌గా వెళుతున్నాం క‌దా అని ఎలా ఉంటుందోన‌ని ఒక‌ట్రెండు షెడ్యూల్స్‌కు అనిపించినా.. చందుపై న‌మ్మ‌కంతో ఆలోచించాల్సిన అవసరం లేదనపించింది.
ఇన్‌వాల్వ్ అవుతాను…
– స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతున్న‌ప్పుడు ఇన్‌వాల్వ్ అవుతాను. డైరెక్ట‌ర్‌తో డిస్క‌స్ చేస్తాను. కానీ దానికి ఓ లిమిట్ ఉంటుంది. దాన్ని మాత్రం దాట‌ను. ఓ డైరెక్ట‌ర్‌కి మనం ఇచ్చే గౌర‌వమేంటో అక్క‌డే తెలుస్తుంది.
వానిష్ సిం డ్రోమ్ గురించి మీకు ముందే తెలుసా?
– లేదండీ. కాకపోతే ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత యూ ట్యూబ్‌, న్యూస్ పేప‌ర్స్‌లో చ‌దివి తెలుసుకున్నాను.  సాధార‌ణంగా ట్విన్స్‌లో ఒకరు వానిష్ అయిపోతే ఆ లక్షణాలు మరొకరి వస్తాయి. అందుకనే ఉన్న వ్యక్తిలో ఒక భాగం మరో వ్యక్తిలా ప్రవర్తిస్తుంది. అదే కదా వానిష్‌ సిండ్రోమ్. ఇక్కడ ఒకే శరీరంలో ఇద్దరు వ్యక్తులున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరోకి ఎడ‌మ చేయి మ‌రో వ్య‌క్తిలా ప్ర‌వ‌ర్తిస్తుంది.
స్క్రిప్ట్స్ ఎంపిక‌లో ఇప్ప‌డు ఫ్రీ హ్యాండ్..
– స్టార్టింగ్‌లో నాన్న‌గారు స్క్రిప్ట్స్ విని ఓకే చేసేశారు. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.
చిన్న చిన్న స‌ల‌హాలు
– `స‌వ్య‌సాచి` సినిమాను ఎడిటింగ్ రూమ్‌లో చూశారు. ఎమోష‌న‌ల్ పాయింట్స్ ద‌గ్గ‌ర చిన్న చిన్న స‌ల‌హాలు మాత్ర‌మే చెప్పారు. మేజ‌ర్‌గా ఏమీ చెప్ప‌లేదు.
నిర్మాత‌లు గురించి..
– కథను నమ్మి సినిమాలు చేసే నిర్మాత‌లు.. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. వారు మా ప్రాజెక్ట్‌ను టేక‌ప్ చేయ‌డంతో సినిమా స్పాన్ పెరిగింది. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. మాధ‌వ‌న్‌గారిని, భూమికగారిని సజెస్ట్ చేసింది కూడా నిర్మాత‌లే.
మాధవన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్..
– మాధవన్‌గారు ఇప్పటికీ ట్రెండ్ సెట్ట‌రే ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీ. చాలా విష‌యాలు నేర్చుకున్నాను.  ఆయ‌న నాతో వ‌ర్క్ చేస్తున్నార‌ని తెలిసి నా స్నేహితులు చాలా మంది వ‌చ్చి ఆయ‌న‌తో ఫోటోలు దిగారు.
హీరోయిన్ నిధి గురించి…?
– నిధి చాలా హార్డ్ వ‌ర్క‌ర్‌, టాలెంటెడ్. ఆల్ రౌండర్. డ్యాన్సలుఉ చేయగలదు. ఇలాంటి సినిమాల్లో ఫ్రెష్ ఫేస్‌లు క్లిక్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువ. అందుకే తీసుకున్నాం.
త‌దుప‌రి చిత్రాలు…
– ప్ర‌స్తుతం శివ నిర్వాణ సినిమా చేస్తున్నాను. నేను, సామ్ ఇందులో పెళ్లైన జంట‌గానే క‌న‌ప‌డ‌తాం. నిజ జీవితంలో గొడ‌వ‌లు ప‌డం కానీ.. సినిమాలో మాత్రం గొడ‌వ ప‌డే జంట‌గా క‌న‌ప‌డ‌తాం. సాధార‌ణంగా ఆదివారాల్లో ఇద్ద‌రం క‌లిసి ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటాం. ఈ సినిమాలో ఇద్ద‌రం క‌లిసి న‌టిస్తుండ‌టం వ‌ల్ల ఇంకా ఎక్కువ స‌మయం  గ‌డుపుతున్నాం. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రికి పూర్త‌వుతుంది. స‌మ్మ‌ర్‌కి విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు వెంకీమామ సినిమా డిసెంబర్ నుంచి మొదలవుతుంది.
hero nagachaitanya latest news,nagachaitanya new movie savyasachi.hero akkineni nagachaitanya latest interview,savyasachi releasing on november 02

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *