కేసీఆర్ పాత్ర‌లో శ్రీకాంత్‌

Hero Srikanth 

సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఓ చాలెంజింగ్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఆ పాత్ర ఎవ‌రిదో కాదు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్‌దే. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన కె.సి.ఆర్‌.. తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడిగా.. తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిగా త‌న‌దైన ముద్ర‌వేశారు. ఇప్పుడు హ‌రీశ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు `తెలంగాణ దేవుడు` పేరుతో కె.సి.ఆర్ జీవిత చరిత్ర‌ను సినిమాగా తెర‌కెక్కించ‌బోతున్నారు ఇందులో శ్రీకాంత్ న‌టిస్తున్నారు. కె.సి.ఆర్ పాత్ర కాబ‌ట్టి శ్రీకాంత్ ఆయ‌న బాడీ లాంగ్వేజ్ కోసం ఆయ‌న పాల్గొన్న ప‌లు మీటింగులు, అసెంబ్లీలో ఆయ‌న ప్ర‌వ‌ర్తించే తీరు తెన్నుల‌కు సంబంధించిన ప‌లు వీడియోల‌ను చూశార‌ట‌. తెలంగాణ యాస కోసం ఉత్తేజ్ స‌హకారం అందిస్తున్నార‌ట‌.

Hero Srikanth in the role of KCR , Hero Srikanath Telugu Movie 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *