హిల్టన్ గ్రూప్ హోటళ్లపై రూ.700 కోట్లకు దావా

 Hilton Group hotels

  • స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశారని ఆరోపణ
  • మూడేళ్ల క్రితం షికాగోలో ఘటన.. తాజాగా వెలుగులోకి..

హోటళ్లు, మాల్స్ లోని ట్రైల్ రూములు వంటి చోట రహస్య కెమెరాలు అమర్చి నగ్న వీడియోలు రికార్డు చేయడం.. తర్వాత వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయడం ఇటీవల కాలంలో ఎక్కవైపోయాయి. ఊరూ పేరూ లేని చిన్న చిన్న హోటళ్లలో ఇలాంటి అక్రమాలు జరగడానికే ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ, తాజాగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఓ హోటల్ గ్రూప్ ఇలాంటి వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ హోటల్ గ్రూప్ హిల్టన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ పై ఓ మహిళ ఏకంగా 10 కోట్ల డాలర్లకు దావా వేసింది. తాను స్నానం చేస్తుండగా బాత్ రూమ్ లో రహస్య కెమెరా ద్వారా చిత్రీకరించారని, అనంతరం ఆ వీడియోను ఇంటర్నెట్ లో పోస్టు చేశారని ఆమె పేర్కొన్నారు. షికాగోకు చెందిన ఓ మహిళ2015 జులైలో న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ అల్బనీలో ఉన్న హిల్టన్ గ్రూప్ హోటల్ లో బస చేశారు. ఆ సమయంలో ఆమె స్నానం చేస్తుండగా అక్కడే ఉన్న రహస్య కెమెరాలో రికార్డయ్యింది. ఈ విషయం ఆమెకు అప్పుడు తెలియదు. అయితే, మూడేళ్ల తర్వాత ఈ ఏడాది సెప్టెంబరులో ఆమెకు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చింది. ఆమె స్నానం చేస్తున్నట్టుగా ఉన్న వీడియోను పంపించి, బెదిరింపులకు పాల్పడ్డాడు. తాను కోరినంత డబ్బు ఇవ్వకుంటే ఈ వీడియోను అశ్లీల వెబ్ సైట్లలో పోస్టు చేస్తానని హెచ్చరించాడు. దీంతో తీవ్రంగా ఆందోళనకు గురైన ఆ మహిళ వెంటనే కోర్టును ఆశ్రయించారు. తన ప్రైవసీకి తీవ్రంగా నష్టం కలిగించి, మానసిక క్షోభకు గురిచేసిన హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని హిల్టన్ హోటళ్లపై 10 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.700 కోట్లు) దావా వేశారు.

 

Claims up to Rs.700 crore on Hilton Group hotels ,   Court news on  Hilton Group hotels , video of bathing News, Event in Chicago three years ago  Chicago latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *