ఆశా పాశం తెగిప‌డినిపుడే

Hospital Negligence Kills 43Older
మాకు చావు డ‌ప్పు త‌ప్ప‌దు
మాకు స్మార్థ క‌ర్మ త‌ప్ప‌దు
కొడుకా.. నీవ్వేడ..
ఇదిగో నీ బండి ఆగిపోయిందిరా
నీ ఊపిరి ఆగిపోయిందిరా
లే.. ఇక్క‌డి నుంచి వెళ్లిపో..
పాపిష్టి లోకాన నీకు చోటుందా లేదు క‌దా!
………………………………………………
ఆ కుటుంబం ఓ ఆధారాన్ని కోల్పోయింది. చాలిన‌న్ని డబ్బులు లేక ఆస్ప‌త్రి ఫీజులు చెల్లించ‌లేక నిండు ప్రాణం గాల్లో క‌లిసిపోయింది. య‌థావిధిగా ఉద‌యం.. య‌థాలాపంగా సాయంత్రం.. ఒరేయ్ శ‌వాన్ని మొయ్యారా.. క‌దిలించ‌కు ఈ మౌన మృదంగాన్ని.. ద‌రిద్ర‌గొట్టు మ‌నుషుల్లారా ! ఈ చావు కు విలువ మీరు క‌డ‌తారా..! ప్రాణానికి ఖ‌రీదు మీరే నిర్థారిస్తారా.. ! సాలూరుకు చెందిన శ్రీ‌నివాస్ క‌న్నీటి క‌థ ఇది. డెంగీ బారిన ప‌డి ఆస్ప‌త్రికిపోతే  అడిగినంత ఫీజు చెల్లిస్తే ఆస్ప‌త్రిలో చేర్చుకుంటామ‌ని చెప్పి పంపిన ఆస్ప‌త్రి నిర్వాకం ఇది.. ఇప్పుడు  చ‌ద‌వండిక కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త‌గా రూపొందించిన ఆరోగ్య ముసాయిదా నివేదిక‌.. వైద్యం పొందడం హ‌క్కుఅని చెబుతోంది. పేద పెద్ద తేడాలే వ‌ద్దంటోంది.విన‌ప‌డ‌తాయా.. అత్య‌వ‌స‌ర సమయాన వైద్యం పొంద‌డం హ‌క్కు అని అరుస్తోంది. విన‌బ‌డుతుందా నా మా రాజా!
………………………………………………
చావు బ‌తుకుల కొట్లాట‌కు ఆరంభం ఆస్ప‌త్రి
పేగు బంధం తెంచుతుంది.. మ‌ర‌ణ పాశం విస‌రుతుంది
ఆ కుర్రాడి జీవితం కూడా ఇందుకు అతీత‌మా కాదు క‌దూ!
 ………………………..…………………….
హ‌క్కులు గురించి మాట్లాడ‌కు నీవు
ప్రాణం పోయినా వాడికి చిల్ల‌ర పైస‌లే ముఖ్యం క‌దూ..
కుత్తుక తెగి ప‌డినా వాడికి రుసుము చెల్లించు.. అటు త‌ర్వాతే ఏమైనా..
  ………………………………………………
ఇదిగో రామ‌జ‌న్ని శ్రీ‌ను (43) ఇక్క‌డి నుంచి వెళ్లిపో.. జ్వ‌ర పీడితుడిగా వ‌చ్చావు క‌దా ఇక్క‌డికి నీవు ఫీజు చెల్లించ‌లేవు క‌దా ఇక్క‌డి నుంచి వెళ్లి పో.. న‌ల‌భై వేల రూపాయ‌లు చెల్లించ‌గ‌ల వా.. అవును నీకు ప్లేట్ లెట్ కౌంట్ ప‌డిపోయింది. అది పూర్వ స్థితికి చేరాలంటే ఫీజు చెల్లించాల్సిందే అన్నదొక విశాఖ ప్రైవేటు ఆస్స‌త్రి.. సాలూరు మండ‌లం క‌రాసు వ‌ల‌స ఎస్సీ కాల‌నీకి చెందిన శ్రీ‌నివాసు ఇప్పుడు లేడు. వైద్యం చేయించేందు కు సొమ్ముల్లేక ప్ర‌భుత్వాస్ప‌త్రి (కేజీహెచ్‌)లో చేరి, చికిత్స మొద‌ల‌య్య‌లోగానే చ‌నిపోయాడు. ఇప్పుడు మీరు ఎవ్వ‌రినీ ఏమీ అనొద్దు. సావ‌ధానంగా అదిగో ఆ ఆరోగ్య ముసాయిదా నివేదిక‌ను చ‌దువుకోండి. ఇంత‌కుమించిన ఘోరం ఇంకొక‌టి ఉండ‌ద‌ని భావించ‌కండి. అది త‌ప్పు..ఏలిన వారు ఆస్ప‌త్రుల కు క‌నీస సౌకర్యాలు క‌ల్పించ‌రు. ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు ధ‌న దాహం వీడి సేవా మార్గం ప‌ట్ట‌వు. అవును మా ద‌గ్గ‌ర జ్వ‌రం వ‌స్తే ప్రాణం పోవాల్సిం దే… అవును విజీన‌గ‌రంలో ప‌ది మంది చ‌నిపోయారు.. .జ్వ‌రం తోనే .. ఒరేయ్ చావు డ‌ప్పు కొట్ట‌రా.. ఝ‌న్‌!!! ఒరేయ్ ఆ లారీ డ్ర‌యివ‌రు చావుకు ఖ‌రీదు క‌ట్టు ముగ్గురు కొడుకులకూ పంచిపెట్టు ప‌రిహారాన్ని మా రాజా !!!
– రత్న‌కిశోర్ శంభుమ‌హంతి
Hospital Negligence Kills 43Older,Telugu Latest Updates,To Day Breaking News,Salur Srinivas Dies For Dengue,Dengue Kills 43Years Older,Srinivas Victim For Hospital Negligence,AP Latest Updates,Telugu Updates,Andhra Latest News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *