డ్యూయల్ సిమ్ తో ఐ ఫోన్?

iPhone Dual SIM

  • రెండు మోడళ్లు రూపొందించిన ఆపిల్
  • 12న విడుదల చేసే అవకాశం

మొబైల్ ఫోన్లలో ఐఫోన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐఫోన్ నుంచి కొత్త మోడల్ వస్తుందంటే చాలు.. స్మార్ట్ ఫోన్ ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటమే కాకుండా, రిలీజైన వెంటనే ఆ ఫోన్ దక్కించుకోవడానికి చాంతాడంత క్యూల్లో కూడా పడిగాపులు కాస్తారు. అయితే, ఐఫోన్లో ఎన్ని ఫీచర్లు ఉన్నా, ఒక్క సిమ్ తోనే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేది. ఇకపై ఆ వెలితి కూడా తీరనుంది. డ్యూయల్ సిమ్ స్లాట్ తో ఐఫోన్ మార్కెట్లోకి వస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ మ్యాక్స్ పేరుతో రెండు మోడళ్లను రూపొందించింది. కాలిఫోర్నియాలో త్వరలోనే జరగనున్న అంతర్జాతీయ టెక్-సదస్సులో ఈ మోడల్ ను ఆవిష్కరించనున్నారు. అయితే ఇవన్నీ లీకులు మాత్రమే. ఆపిల్ సంస్థ నుంచి మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. డ్యూయల్ సిమ్ ఫోన్లపై పని జరుగుతోందనే విషయాన్ని కొన్ని నెలల కిందటే ఆపిల్ నిర్థారించింది. అది ఐఫోన్ ఎక్స్ఎస్ రూపంలో రాబోతోందంటూ అంతర్జాతీయ స్థాయిలో లీకులు మొదలయ్యాయి. అంతేకాదు, మోడల్ కు సంబంధించి కొన్ని పిక్స్ ను కూడా కొన్ని టెక్-సైట్స్ ప్రచురించాయి. తాజా సమాచారం ప్రకారం, ఎరుపు రంగు మోడల్ ను ఆవిష్కరించనున్న ఆపిల్ సంస్థ.. దీంతో పాటు నీలం, తెలుగు, రోజ్ గోల్డ్ రంగుల్లో డ్యూయల్ ఫోన్లను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. డ్యూయల్ ఐఫోన్లు 6.1 అంగుళాల ఎల్ సీడీ స్క్రీన్ కలిగి ఉంటాయి. డ్యూయల్ సిమ్ ఐఫోన్ రూ.76 వేల నుంచి మొదలయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా. ఇందులో హై-ఎండ్ మోడల్ ధర రూ.96 వేల ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. డ్యూయల్ సిమ్ స్లాట్ మినహాయిస్తే, మిగతా ఫీచర్లన్నీ పాతవే. అయితే ఈ మోడల్స్ లో కేవలం డ్యూయల్ సిమ్ స్లాట్స్ మాత్రమే కాకుండా.. సింగిల్ స్టాట్ సిమ్ ఉన్న మోడళ్లను కూడా అమ్మాలని ఆపిల్ నిర్ణయించింది. ఎందుకంటే, కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే ఇలాంటి డ్యూయల్ సిమ్ ఫోన్లకు డిమాండ్ ఉంది. అందుకే భారత్, చైనా లాంటి దేశాల్లోని వినియోగదారుల్ని దృష్టిలో పెట్టుకొని రెండు రకాల ఫోన్లను సిద్ధం చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 12వ తేదీన ఈ మోడల్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.

These are the Iphone Comes with DUAL SIM  

Iphone XS Specification Check Here  >>

Iphone XS MAX Specifications Check Here  >>

Iphone SR Specification Check Here  >>

Is It True iPhone Dual SIM?,Dual SIM For iPhone, iPhone 7Dual SIM,iPhone XS,iPhone XMAX,iPhone Latest Updates,iPhone New Model Updates,Mobile Market,Technology Updates,iPhone Dual SIM Coming Soon,What About iPhone Dual SIM?

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *