ఆ ఫోన్ ధర రూ.లక్షన్నర పైనే

I Phone Price was More than (1.5) One Half Lakh

స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో సంచలనం సృష్టించే లక్ష్యంతో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శామ్ సంగ్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకురావడానికి కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ ఫోన్ ధర తెలిస్తే మాత్రం గుండె గుభేల్ మనడం ఖాయం. ఇటీవలే కంపెనీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ఫోన్ ను పరీక్షించారు. త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోయే ఈ ఫోన్ ధర రూ.1500 పౌండ్లు (రూ.1,35,836) నుంచి 2000 పౌండ్లు (రూ.1,81,195) వరకు ఉండొచ్చని అంచనా.

ఐఫోన్ టాప్ ఎండ్ మోడల్ ఎక్స్ ఎస్ మ్యాక్స్ ధర (రూ.1,02,379) కంటే ఇది చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో అంత మొత్తం వెచ్చించి ఈ ఫోన్ ను ఎంతమంది కొనుగోలు చేస్తారన్నది చెప్పలేం. మరోవైపు మడత పెట్టే స్క్రీన్ పనితీరు ఎలా ఉంటుందో ఇంకా అంచనా వేయలేం.
రెగ్యులర్ స్మార్ట్ ఫోన్లకు ప్రత్యామ్నాయంగా ఈ ఫోన్ ను తీసుకురావాలని శామ్ సంగ్ యోచిస్తున్నప్పటకీ, ధర ఓ ఆటంకంగా ఉండొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది అధికారిక ధర కాకపోవడంతో, ఈ ఫోన్ ను విడుదల చేసే సమయానికి కంపెనీ ధర విషయంలో ఏమైనా తగ్గింపు ఇచ్చే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని అంటున్నారు. మరోవైపు పెద్ద స్క్రీన్ కావడంతో బ్యాటరీ సామర్థ్యం ఎంత ఉంటుందనే అంశం కూడా ఈ ఫోన్ విజయం కావడం ఆధారపడి ఉంటుంది.

Check Latest Iphone Price and Specifications in AMAZON and FLipkart

Iphone XS IN AMAZON   |   Iphone XS IN AMAZON    |   Iphone XR IN AMAZON

For More latest Mobile news and Update Checkout Here 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *