జగన్ దాడి ఘటనలో వైసీపీ మాజీ ఎంపీల షాకింగ్ డెసిషన్

 Jagan attack case

జగన్ పై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చెయ్యటానికి సిద్ధం అయ్యారు. ఢిల్లీ వెళ్లిన నేతలు కేంద్ర హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ నెల 25 న విశాఖ ఎయిర్ పోర్ట్ లో తమ అధినేత జగన్ పై దాడి ఘటనపై విచారణ జరిపించాలని కోరినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే రాష్ట్రపతి అపాయింట్మెంట్ సైఅతం కోరిన వారు కేంద్రాన్ని జగన్ పై జరిగిన దాడి ఘటనలో రంగంలోకి దించాలని యత్నిస్తున్నారు.
జగన్ పై కత్తి తో దాడి జరిగినప్పటి నుండి వైసీపీ నేతలు తమకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ ఆరోపిస్తూ వస్తున్నారు. జగన్ పై అధికార పార్టీనే కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రాజనాధ్ సింగ్ తో బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి, వరప్రసాద్, విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. జగన్ పై దాడి ఘటనపై జ్యూడిషియల్ విచారణ కోరినట్టు తెలుస్తోంది.
అంతేకాదు రాష్ట్రపతి రాజనాధ్ కోవింద్ అపాయింట్మెంట్ కూడా వారు కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై రాష్ట్రపతి భవన్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. సోమవారం లేదా మంగళవారం రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు నేతలు. మరో రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండి పలువురు కేంద్రమంత్రులను, ఇతర నేతలను కలవాలని వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి హస్తిన వేదికగా అన్ని పార్టీలు రాజకీయాలు చెయ్యటం ఎన్నికల నేపధ్యంలో అధికారం కోసమే అని స్పష్టం గా అర్ధం అవుతుంది. జగన్ పై దాడి వ్యవహారం కూడా ఇలా జాతీయ స్థాయిలో చర్చ కు రావటానికి ఇదే కారణంగా కనిపిస్తుంది. చంద్రబాబు హస్తిన వేదికగా రాజకీయాలు నేరపుతున్నాడని వైసీపీ నేతలు కూడా హస్తిన చేరి రాజకీయాలు చెయ్యటం ఏపీ లో చర్చకు దారితీస్తుంది.

Jagan Attack Case News, Political Leaders Sitting With Home Minister rajnath Singh ,

Shocking Decision of Ex MPs of the YCP in the Jagan attack case

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *