జగన్ ముఖ్య అనుచరుడి కిడ్నాప్ కలకలం

Jagan latest news

తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధం అవుతుంటే ఎక్కడ ఏమి జరిగినా అక్కడ అనుమానమే ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులు ఏమైనా చేస్తున్నారా అన్న ఆందోళన కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే తాజాగా జరిగిన ఓ కిడ్నాప్ కూడా అలాంటి అనుమానాలకే తావిస్తోంది.
అతను వై ఎస్ జగన్ కు నమ్మిన బంటు. మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు. అంతేనా భూ వివాదాలు, సెటిల్మెంట్ లు చెయ్యడంలో అందెవేసిన చెయ్యి. జగన్ కు ముఖ్య అనుచరుడిగా పేరున్న మంగలి కృష్ణ కిడ్నాప్ కు గురయ్యారు. మంగలి కృష్ణ కిడ్నాప్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకపక్క ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ ముఖ్య అనుచరుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చెయ్యటం సంచలన వార్తగా మారింది. ఇంతకీ మనగలి కృష్ణ ను కిడ్నాప్ చేసింది ఎవరు ఎందుకు అన్న కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్ జ‌గ‌న్ న‌మ్మిన‌బంటు, వైసీపీ నేత మంగలి కృష్ణ అలియాస్ దంతులూరి కృష్ణ కిడ్నాప్ క‌ల‌క‌లం రేపుతోంది. హైద‌రాబాద్‌లో మంగ‌లి కృష్ణను కొంత‌మంది దుండ‌గులు కిడ్నాప్ చేశారు. ఇటీవ‌ల జూబ్లీహిల్స్ స్టేష‌న్‌లో మంగ‌లి కృష్ణ‌పై ఒక భూ వివాదం కేసు న‌మోదైంది. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా గురువారం నాంప‌ల్లి కోర్టుకు మంగ‌లి కృష్ణ హాజ‌రైన కృష్ణకు బెయిల్ మంజూరు అయింది. కేసు విచార‌ణ అనంత‌రం త‌న వాహ‌నంలో ఇంటికి వెళుతున్న మంగ‌లి కృష్ణను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేయ‌డం స్థానికంగా చర్చకు దారి తీస్తుంది. . మంగ‌లి కృష్ణ వాహనాన్ని వెంబ‌డించిన దుండ‌గులు కృష్ణ అనుచరులను కొట్టి కిడ్నాప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఆరా తీసున్నారు. భూ వివాదం కేసు తాలూకు జరిగిన ఘటనా లేదా ఇత‌ర ముఠాలు తీసుకెళ్లాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు.అయితే పలు వివాదాల్లో ఉన్న మంగలి కృష్ణ కిడ్నాప్ ను కూడా వైసీపీ రాజకీయం చేస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Jagan latest news , Jagan Main follower Candidate Kidnapped , Mangali krishna , telugu news, telugu latest news, jagan update news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *