ఆగుతూ..సాగుతూ..

Jagan Padayatra
– జ‌గ‌న్ పాద‌యాత్ర
– 300 రోజులు పూర్తి
– విజ‌య‌న‌గ‌రంలో
తోట‌ప‌ల్లి ప్రాజెక్టు వ‌ద్ద మొక్కలు నాటిన ప్ర‌తిప‌క్ష నేత‌
విజ‌య‌న‌గ‌రం : విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పాదయాత్ర కీల‌క మైలురాయిని దాటేసింది. ఆయ‌న ఇప్ప‌టిదాకా 3300 కిలోమీట‌ర్లు న‌డిచారు. గ‌రుగుబిల్లి మండ‌లం, ఉల్లి భ‌ద్ర వ‌ద్ద కేక్ క‌ట్ చేసి త‌న ఆనందం అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే పాముల స‌త్య‌వాణి పాల్గొన్నారు.
ఆయ‌న పాద‌యాత్ర‌కు ఇక్క‌డ మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ప‌లువురు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటూ వాటినిప‌రిష్క‌రించాల‌ని కోరుతున్నారు.
ఉత్తరాంధ్రలో జ‌గ‌న్ పార్టీ మ‌రింత బ‌లోపేతం అయ్యేలా ఈ పాద‌యాత్ర స‌హ‌క‌రిస్తుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట.జ‌గ‌న్ తో పాటు ప‌లువురు నేత‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సంఘీభావయాత్ర‌లు చేస్తున్నారు.వీటికి కూడా మంచి స్పంద‌న వ‌స్తోంది. రానున్న కాలంలో తాము అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో అన్న‌ది చెబుతూ, టీడీపీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ఆయ‌న సాగుతున్నారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో బొత్స‌, ధ‌ర్మాన వంటి నేత‌లంతా ఆయ‌న పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేసేందుకు కృషిచేస్తున్నారు. కీల‌కంగా ఉన్న ఇక్క‌డి ఓట‌రును త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తు న్నారు.ముఖ్యంగా తోట‌ప‌ల్లి నిర్వాసితుల స‌మ‌స్య ప‌రిష్కరిస్తే ఏ పాల‌కుల‌కు అయినా కాస్తైనా ప్ర‌జ‌ల అండ దొరుకుతుంది.కానీ ప్ర‌స్తుతం ఇక్క‌డ నిర్వాసితుల స‌మ‌స్య కీల‌కంగా ఉన్నందున జ‌గ‌న్ పై ప్ర‌జ‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. ఒక‌వేళ అధికారంలోకి వైసీపీవ‌స్తే ఈ స‌మ‌స్య వారికి స‌వాల్ గా మార‌నుంది. అదేవిధంగా జ‌గ‌న్ ను ప‌లువురు నర్సింగ్ విద్యార్థులు క‌లుసుకున్నారు. త‌మ‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించాల‌ని వేడుకున్నారు.

Jagan Padayatra, AP Latest news, Vijayanagaram Thotapalli Project News, MLA Pamula Satyanarayana , Jagan Padayatra latest news, YSRCP Party news.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *