తేలిన జనగామ జగడం … పొన్నాల ఇన్ కోదండరాం ఔట్

Janagama Political news

ఎట్టకేలకు జనగామ జగడం తేలింది. పొన్నాలకు సీటు త్యాగం చేసి కోదండ రామ్ పెద్దరికం చూపించారు. ఎన్నికల పోరు నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తప్పుకున్నారు. జనగామ టికెట్ ను ఆయన కాంగ్రెసు నేత పొన్నాల లక్ష్మయ్యకు త్యాగం చేశారు. కోదండరామ్ తో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా చర్చలు జరిపారు. ఆయన్ని పెద్ద మనసు చేసుకోవాలని కోరారు. ఆయన స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఒక పక్క బీసీ నేత సీటు కోదండ రాం తీసుకున్నాడు అన్న ఆరోపణలు కూడా కోదండ రాం కు ఇష్టం లేక చివరకు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు కోదండరామ్ అంగీకరించారు.
శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 3 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో పొన్నాల లక్ష్మయ్య కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల నాడి కోదండరామ్ కు బాగా తెలుసునని, అది తమకు ప్రయోజనం చేకూరుస్తుందని కుంతియా అన్నారు. కూటమికి కోదండరామ్ కన్వీనర్ గా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు.
కోదండరామ్ అంగీకారంతో జనగామ టికెట్ పొన్నాల లక్ష్మయ్యకే దక్కింది. కోదండరామ్ కనీస ఉమ్మడి కార్యాచరణ కమిటీ చైర్మన్ గా ఉంటారని కుంతియా చెప్పారు. మహా కూటమి అధికారంలోకి వస్తే ఆ పదవికి క్యాబినెట్ హోదా కల్పిస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రచారంలో సోనియా, రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు. మహా కూటమి నేతలు ఉమ్మడిగా ప్రచారం సాగిస్తారని చెప్పారు. రాష్ట్రమంతా పర్యటించాలని కోదండరామ్ ను కోరినట్లు ఆయన తెలిపారు.
కూటమికి పీపుల్స్ ఫ్రంట్ గా నామకరణం చేయాలని కాంగ్రెసు, టిజెఎస్ చర్చల్లో ఓ నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి కోదండ రామ్ ఎట్టకేలకు సర్దుకుపోయి జనగామ సీటు త్యాగం చేసి మరోసారి పొన్నాలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు.

Janagama Political news , Election war in Telangana, Ponnala seat Conform in Janagama ,Congress latest news, Kodandaram latest news, Telugu news 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *