ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ రానట్టేనా?

JR NTR  and Kalyan ram Latest news on Suhasini Comapaign

· సోదరి నామినేషన్ కు హాజరుకాని జూనియర్, కళ్యాణ్ రామ్

· సుహాసినిని గెలిపించాలని ట్విటర్ ద్వారా సందేశం

కూకట్ పల్లి బరిలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలోకి దింపడం ద్వారా తాను అనుకున్నది చంద్రబాబు సాధించినట్టేనా? తొలుత పెద్దిరెడ్డిని ప్రకటించిన ఆ స్థానాన్ని అనూహ్యంగా సుహాసినికి కేటాయించడం వెనుక వ్యూహం వర్కవుట్ అయినట్టేనా? అంటే పూర్తిస్థాయిలో చంద్రబాబు వ్యూహం ఫలించలేదనే అంటున్నారు. వాస్తవానికి కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీచేయాల్సిందిగా హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ కు ప్రతిపాదన పంపించారు. అయితే, అందుకు కళ్యాణ్ రామ్ అంగీకరించకపోవడంతో చంద్రబాబు అనూహ్యంగా సుహాసినిని పేరును తెర పైకి తెచ్చారు. ఆమెను పోటీకి దింపితే అటు హరికృష్ణ అభిమానులతోపాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కూడా కొల్లగొట్టొచ్చని భావించారు. పైగా కూకట్ పల్లిలో ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ఆకర్షించొచ్చని యోచించారు. దీంతోనే అకస్మాత్తుగా సుహాసిని పేరు తెర పైకి తేవడం.. ఆమెతో మాట్లాడటం.. ఆమె అంగీకరించడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే తన తండ్రికి ఘనంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సోదరి కోసం జూనియర్ ఎన్టీఆర్ – కల్యాణ్ రామ్ ప్రచార బరిలోకి దిగుతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. తమకు మాట మాత్రమైనా చెప్పకుండానే సుహాసినిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని చంద్రబాబుపై హరికృష్ణ కొడుకులు గుర్రుగా ఉన్నారనే వార్తలు ఈ ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. పైగా సుహాసిని నామినేషన్ కార్యక్రమానికి సోదరులిద్దరూ హాజరు కాకపోవడం గమనార్హం. నందమూరి బాలకృష్ణ మాత్రం సుహాసినితో కలసి వెళ్లి ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఆమె తరఫున ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. టీడీపీ తరఫున తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా? అన్న ప్రశ్నకు బాలయ్య ముక్తసరిగా స్పందించారు. సినిమా షెడ్యూళ్లు – ఇతర కార్యక్రమాలను బట్టి ప్రచారానికి వచ్చేది – లేనిది వాళ్లే చూసుకుంటారని బదులిచ్చారు. దీనిని బట్టి చూస్తుంటే ఈ సారి ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ రారనే విషయం తెలిసిపోతోంది. సుహాసిని రాజకీయ ఆరంగేట్రం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు ఏమాత్రం ఇష్టం లేదని అంటున్నారు. అందువల్లే నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదని వ్యాఖ్యానిస్తున్నారు. తమ సోదరిని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ సోదరులిద్దరూ ట్విటర్ ద్వారా స్పందించి ఊరుకున్నారు.

JR NTR  and Kalyan ram Latest news on Suhasini Comapaign  , TDP Latest news , Nandamuri Suhasini Campaign in Kukatpally, telugu news, telugu latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *