జూబ్లీ హిల్స్ టీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కి నిరసన సెగ

jubliehills mla maganti gopinath latest news

టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీ నాథ్ కు ఉద్యమ కారులు, మహిళలు షాక్ ఇచ్చారు. ఎన్నికల సమయంలోనే గుర్తు వస్తామా అని నిలదీశారు. జూబ్లీ హిల్స్ నుండి పోటీ లో ఉన్న ఆయనకు అడుగడుగునా నిరసన సెగ తగులుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఒక్క సమస్య కూడా పరిష్కరించని నువ్వు ఓట్ల కోసం వస్తే ఓటు ఎలా వేస్తాం అంటూ మహిళలు ఆగ్రహం తో మాట్లాడారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కు కాకుండా  తెలంగాణ ఉద్యమకారులకు టికెట్టు కేటాయించాలని తెలంగాణ ఉద్యమ కారుడు ఇంద్రసేన తన ఇంట్లోనే  నిరసనకు దిగాడు.ఇంట్లోనే తలుపులు బిగించుకొని నిరసనకు దిగాడు.

మాగంటి గోపినాథ్‌కు బదులుగా మరొకరికి సీటును ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటే మాగంటి కే మరో చోట చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో మాగంటి గోపినాథ్ కు మహిళల నుండి  నిరసన వ్యక్తం అయ్యింది .ఓట్ల కోసం వచ్చిన మాగంటి గోపినాథ్‌ను నాలుగేళ్లపాటు ఏం చేశావని ప్రశ్నించారు. ఓట్ల సమయంలోనే గుర్తుకు వచ్చామా అంటూ నిలదీశారు. దీంతో ప్రచారాన్ని మాగంటి గోపినాథ్ అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లిపోయాడు.

jubliehills mla maganti gopinath latest news,maganti gopinath latest updates,jubliehills ladies gave shock to mla maganti gopinath

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *