క‌న్న‌డ నాట వింత రాజ‌కీయం

kannada political news
దేశ వ్యాప్తంగా బీజేపీ గ‌డ్డుకాలం ఎదుర్కొంటుందో లేదో కానీ
క‌న్న‌డ నాట మాత్రం ఇప్ప‌టికీ ఏదో ఒక రూపంలో ఖంగుతింటూనే ఉంది
గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేయాల‌ని తెగ క‌ల‌లు క‌న్న బీజేపీ కి
నాటి ప‌రిణామాలు ఊహించ‌ని విధంగా షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ అధినేత‌ల చొర‌వ
ఫ‌లించి అక్క‌డ బీజేపీయేత‌ర ప్ర‌భుత్వ ఏర్పాటు సాధ్యం అయ్యింది.తాజా ప‌రిణామాల్లో భాగంగా
క‌న్న‌డ నాట జ‌రుగుతున్న ఉప  ఎన్నిక పోరులోఓ ఆసక్తిదాయ‌క స‌న్నివేశం చోటుచేసుకుంది..
అదేంట‌న్న‌ది తెల్సుకోవాలంటే చ‌దవండిక ఈ వివ‌రాన్ని..
క‌న్న‌డ నాట వింత ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అక్క‌డి ఉప ఎన్నిక‌ల ఘ‌ట్టంలో అంద‌రినీ విస్తుగొలిపేలా రోజుకో ఘ‌ట‌న న‌మోదుకు నోచుకుంటోంది.తాజాగా రామ‌న‌గ‌ర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి అక్క‌డ బ‌రిలో ఉన్న బీజేపీ అభ్య‌ర్థి ప్లేటు ఫిరాయించేశారు. ప‌నిలో ప‌నిగా పార్టీ కూడా ఫిరాయించేశారు. ఇక్క‌డ  బ‌రిలో ఉన్న ఎల్‌. చంద్ర‌శేఖ‌ర్ తాను పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి నామినేష‌న్ ను విత్ డ్రా చేసుకున్నారు.అంతేకాక పార్టీలో ఐక్య‌త కొర‌వ‌డింద‌ని ఆరోపిస్తూ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అయితే ఇక్క‌డ కాంగ్రెస్ – జేడీయూ కూట‌మి ఉన్నందున బ‌రిలో జేడీయూ త‌ర‌ఫున సీఎం జీవ‌న స‌హచ‌రి అనిత కుమార స్వామి గెలుపున‌కు మార్గం సుగ‌మం అయ్యింది.వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో కుమార స్వామి రామ‌న‌గ‌ర‌, చెన్న‌ప‌ట్న అనే రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి గెలుపొందారు. రామ‌న‌గ‌ర స్థానానికి ఆయ‌న రాజీనామా చేయ‌డంతో ఇక్క‌డ ఎన్నిక అనివార్య‌మైంది.
kannada political news , telugu news , Bjp Latest News, Bjp party political news , latest kannada news, Telugu  update news, tsnews.tv

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *