కర్ణాటకలో బీజేపీకి షాకింగ్ ట్విస్ట్

Karnataka BJP Party

గత ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు.ఎక్కువ సీట్లు తెచ్చుకొని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేక బీజేపీ చతికిలబడింది. యడ్యూరప్ప సీఎం అయిన కొన్ని గంటల్లోనే సీఎంగా రాజీనామా చేసి కన్నీటి పర్యంతం అయిన ఘటన కర్ణాటక ప్రజలు ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేదు. విఫల యత్నం చేసినా కూడా బీజేపీ చివరికి ఓటమిపాలయ్యింది.
అయితే కర్ణాటక రాజకీయం ఎప్పుడూ బీజేపీకి షాక్ లే ఇస్తుంది. కర్ణాటక ఎన్నికలపేరు చెప్తే బీజేపీకి చలి జ్వరం వస్తుంది. ఇప్పుడు కూడా బీజేపీకి అలాంటి పరిస్థితే ఉంది. ఉపఎన్నికలకు సిద్ధం అయిన బీజేపీ కి షాక్ ఇస్తూ పోటీ చేసిన అభ్యర్థి పోటీ నుండి వైదొలగి కాంగ్రెస్ కు జం అయిన ఘటన కర్ణాటక బీజేపీని నిద్ర పోనివ్వటం లేదు.
గత ఎన్నికల్లో అటు రామ్ నగర, ఇటు చెన్నపట్నం నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి కుమార స్వామి రామ్ నగర నియోజకవర్గానికి రాజీనామా చేశారు. అయితే ఈ క్రమంలోనే ఆ నియోజకవర్గానికి రానున్న నవంబరు 3న ఉపఎన్నిక జరగనుండగా, అనుకోని విధంగా బీజీపీ కి షాక్ తగిలింది. బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న ఎల్‌.చంద్రశేఖర్‌ అనూహ్యంగా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ బీజేపీకి భారీ షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా ఆయన బీజేపీపై విమర్శలు చేసి మరీ హస్తం గూటికి చేరారు.
రామ్ నగర్ నియోజకవర్గానికి కుమార స్వామి రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానం నుంచి జేడీఎస్ పార్టీ తరపున ఆయన భార్య అనిత కుమారస్వామి రంగంలోకి దిగారు. ఇక మరో పక్క సంకీర్ణంలో భాగంగా ఆ సీట్ కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టలేదు. ఇక మరో పక్క బీజేపీ తరపున, కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారి ఈ మధ్యనే బీజేపీలో చేరిన ఎల్‌.చంద్రశేఖర్‌ కు అవకాశం ఇచ్చింది. అయితే హోరాహోరీ పోరు ఉంటుంది అని అనుకుంటే చంద్రశేఖర్ వార్ వన్ సైడ్ చేసి బీజేపీ కి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కానీ చివరి నిమిషంలో ఎల్‌.చంద్రశేఖర్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు, తాను మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి సొంత గూటికి చేరాడు. దీంతో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

Karnataka BJP Party, BJP Party News in Karnataka, Banglore BJP Party Latest News, BJP party Update News in Karnataka, Telugu news Update

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *