బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వ‌డానికే ప్ర‌య‌త్నిస్తాను – కాజ‌ల్

Kavacham Latest Movie
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజల్, మెహరీన్ హీరోయిన్లుగా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో నవీన్ సొంటినేని(నాని) నిర్మించిన చిత్రం `కవచం`. డిసెంబ‌ర్ 7న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇంట‌ర్వ్యూ…
పాత్ర ఒప్పుకోవ‌డం వెనుక చాలా కార‌ణాలుంటాయి..
– చేసే ప్ర‌తి సినిమాలో మ‌న పాత్ర వైవిధ్యంగా ఉండాల‌నేం లేదు. నా విష‌యానికి వ‌చ్చేస‌రికి ఓ సినిమాను ఒప్పుకోవ‌డంలో చాలా కార‌ణాలుంటాయి. స్క్రిప్ట్‌ను మొత్తం న‌చ్చి కూడా సినిమా ఒప్పుకున్న సంద‌ర్భాలున్నాయి. అలాంటి సినిమాయే `క‌వ‌చం`.స్క్రిప్ట్ విన‌గానే మంచి సినిమాల్లో భాగం కావాల‌నిపించింది. యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌కు మ‌న‌ల్ని అప్రోచ్ అయిన‌ప్పుడు మ‌నం చేస్తామ‌ని చెబితే వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేసిన‌ట్లుగా కూడా ఉంటుంది. అలాంటి భావంతో కూడా ఈ సినిమా అంగీకిరించాను. సినిమాలో మెయిన్ లీడ్‌గా న‌టించాను. స్టోరీని ముందుకు న‌డిపించే రోల్స్‌లో నాది ఒక పాత్ర‌.
-నేను కొత్త పాత్ర‌లు వ‌చ్చిన‌ప్పుడు వాటిని అడాప్ట్ చేసుకోగ‌లిగే సిచ్యువేష‌న్‌లో ఉన్నానా? అని ఆలోచిస్తాను. నా కంఫ‌ర్ట్ జోన్‌లో ఉండి బ‌య‌ట‌కు వ‌చ్చి చాలెంజింగ్, ఎక్స్‌పెరిమెంట్స్ రోల్స్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాను. అదే విధంగా మ‌రోవైపు ద‌ర్శ‌కులు కూడా నాకు కొత్త కొత్త పాత్ర‌ల‌ను ఆఫ‌ర్ చేస్తున్నారు. ప్ర‌తి పాత్ర‌లో నా బెస్ట్ ఇవ్వ‌డానికే ప్ర‌య‌త్నిస్తున్నాను. జ‌యాజ‌యాల‌నేవి మ‌న చేతిలో ఉండ‌దు క‌దా.
నా స‌క్సెస్‌కు కార‌ణమ‌దే..
– హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్ల‌కు పైగా అవుతుంది. ఇప్ప‌టి త‌రం హీరోయిన్స్‌కు పోటీ పడుతూ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో 50 సినిమాలు చేసిన త‌ర్వాత హీరోయిన్‌గా స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నానంటే అందుకు కార‌ణం హార్డ్ వ‌ర్క్‌. ప్ర‌తి సినిమాకు నా బెస్ట్ ఇస్తాను. వృత్తి ప‌రంగా మ‌నం ఎంత క‌మిటెడ్‌గా, ప్యాష‌నేట్‌గా ఉన్నామ‌నేది కూడా మ‌న స‌క్సెస్‌కు కార‌ణ‌మ‌వుతుంది.
`క్వీన్` రీమేక్ గురించి..
-`క్వీన్‌`లో కంగనా ర‌నౌత్ ఇన్నోసెంట్‌, ఇన్‌టెన్స్‌తో అద్భుతంగా న‌టించారు. ఐదేళ్ల‌ క్రితం క్వీన్ చిత్రాన్ని చూశాను. ఐదేళ్ల త‌ర్వాత ద‌క్షిణాదిన రీమేక్ అవుతుంది. కొన్నిసార్లు నాలుగు భాష‌ల్లో నేనే హీరోయిన్ అని.. కొన్నిసార్లు తెలుగు, త‌మిళంలో హీరోయిన్‌గా చేయ‌మ‌ని .. అడిగారు. ఇలాంటి దశ నుండి న‌లుగురు హీరోయిన్స్ నాలుగు భాష‌ల్లో న‌టించ‌డ‌మ‌నేది గొప్ప విష‌యం. నేను త‌మిళ వెర్ష‌న్‌లో టైటిల్ పాత్ర‌లో న‌టించాను. ఆమె చేసిన‌ట్లుగా పాత్ర‌లోని అమాయ‌క‌త్వాన్ని క్యారీ చేస్తూనే సెన్సిబిలిటీస్‌ను క్యారీ చేశాను. రెండు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మాత్ర‌మే మిగిలి ఉంది.
అమేజింగ్ ఇయ‌ర్‌…
– 2018 నాకు కాస్త ఇబ్బందిక‌రంగానే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలో నాకు మూడు నెల‌లు ఆరోగ్యం స‌రిగ్గా లేకుంటే గ్యాప్ తీసుకుందామ‌నే అనుకున్నాను. చేతిలో ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి బ్రేక్ తీసుకుందామ‌ని అనుకున్నాను. కానీ ఈ ఏడాది బిజీ ఇయ‌ర్‌గా మారింది. బ్రేక్ తీసుకోవ‌డానికి కుద‌ర‌లేదు. నాకు వృత్తిప‌రంగా ఇది అమేజింగ్ ఇయ‌ర్ అని చెప్పొచ్చు.
బెల్లంకొండ శ్రీనివాస్ గురించి..
– బెల్లంకొండ శ్రీనివాస్ నైస్ కోస్టార్‌. త‌నని నేను ఎన్తూ క‌ట్‌లెట్ అని పిలిచేదాన్ని. ప్ర‌తి విష‌యం ప‌ట్ల చాలా ఆస‌క్తిగా ఉంటాడు. చాలా హార్డ్‌వ‌ర్క్‌..ఏదో సాధించాల‌ని త‌ప‌న ప‌డుతుంటాడు. నేను త‌న‌లాగానే ఉంటాను. మా మ‌ధ్య అలాంటి రిలేష‌న్ ఉంది. ఫ్యామిలీలో తండ్రి పేరు ఉప‌యోగించాల‌నుకోడు. త‌న‌కు తానుగా ప్రూవ్ చేసుకోవాల‌నుకుంటాడు.
పెళ్లి గురించి..
– 2018లో పెళ్లిళ్లు జ‌రుగుతున్నాయి. ఓ ద‌శ‌లో నాకూ పెళ్లి చేసుకోవాల‌నిపించింది. అయితే సినిమాలతో బిజీగా ఉన్నాను. పెళ్లి గురించి ఆలోచించేంత స‌మ‌యం లేదు.
స‌మాజంలో చ‌దువు కోసం..
– అర‌కు వ్యాలీలో ట్రైబ‌ల్ పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించే ఆర్గ‌నైజేష‌న్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాను. అక్క‌డి పిల్లల కోసం ఓ స్కూల్ క‌ట్టించాను. దాన్ని ఇంకా డెవ‌లప్ చేయాల‌నుకుంటున్నాను. నేను చేస్తున్న విష‌యాలు గురించి ఎవ‌రికీ చెప్ప‌లేదు.
త‌దుప‌రి చిత్రాలు…
– `ఇండియ‌న్ 2`లో న‌టించ‌నుండ‌టం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ఆ సినిమా వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాను. కామెడీ యాంగిల్ ఉన్న పాత్ర‌ను త‌మిళంలో చేశాను. మ‌రోసారి తేజ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో ఇన్‌టెన్స్ పాత్ర చేయ‌బోతున్నాను. నా కెరీర్‌లో బెస్ట్ రోల్స్‌లో ఇదొక‌టి అవుతుంద‌ని అనుకుంటున్నాను

Kavacham Latest Movie ,Kajal Agarwal Kavacham Latest Movie  , Kajal Agarwal Kavacham Telugu movie , Bellamkonda Srinivas , Meharin, Movie releasing on Dec 7th

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *