ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది కేసీఆర్

KCR Latest News

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, ప్రజకూటమి నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి ఓ వైపు కేటీఆర్ కి సవాల్ విసురుతూనే.. మరోవైపు కేటీఆర్ మీద, ఇతర టీఆర్‌ఎస్‌ నేతల మీద విమర్శలు గుప్పించారు. గతంలో ఎప్పుడూ ఇంతగా విమర్శలకు దిగని రేవూరి సైతం షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ వారసుడిగా హరీష్ రావును ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము కేటీఆర్‌కు ఉందా? అని సవాల్‌ చేసిన రేవూరి ఒకవేళ కేటీఆర్‌ ప్రకటిస్తే ఇంతకు ముందు తాను హరీష్ రావు విషయంలో చేసిన వ్యాఖ్యలను బేషరతుగా విరమించుకుంటానని ప్రకటించి టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు.
చంద్రబాబును వెన్నుపోటు దారుడు అనడాన్ని ఖండించైనా ఆయన ఇది కేటీఆర్‌ దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు . కేటీఆర్‌ను పిల్లకాకిగా అభివర్ణించారు. చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేసిన రేవూరి నాలుగు కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచింది ఈ కేసీఆర్ కుటుంబంలోని నలుగురేనన్నారు. చంద్రబాబును కార్నర్‌ చేసి లబ్దిపొందాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
1995లో డీసీసీబీ ఎన్నికలకు సంబంధించి వరంగల్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో కేసీఆర్‌, నగేశ్‌, కడియం శ్రీహరి, దయాకర్‌రావు, మాధవరెడ్డి అన్నగారి ఆదేశాలకు వ్యతిరేకంగా పని చేశారన్నారు. వీరంతా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తమను సస్పెండ్‌ చేయకుండా చూడాలని చంద్రబాబును వైస్రాయి హోటల్‌కు తీసుకువెళ్లారని, బాబు తన వంతు ప్రయత్నం చేస్తుండగానే ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది కేసీఆరేనని అన్నారు. చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర హీనులవుతారని ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. మొత్తానికి గత రాజకీయాల్లోని షాకింగ్ విషయాలను వెల్లడించిన రేవూరి ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది కేసీఆరే అని చెప్పి రాజకీయ దుమారం రేపారు.

KCR Latest News ,Telugu News, Tealangana latest News, Telugu News , NTR ,Harish Rao, KTR Latest News, Telugu Update News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *