కేసీఆర్ శిబిరంలో ఆందోళ‌న‌

KCR TENSION STARTED
ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెర తీసిన కేసీఆర్ 105 మంది అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి రాజ‌కీయ సంచ‌ల‌నం రేపారు. ఆయ‌న దైర్యానికి అంద‌రూ అభినందించారు. కాని ఎన్నిక‌లు తేదీ ద‌గ్గ‌ర వ‌స్తున్నా కొద్ది కేసీఆర్ శిబిరంలో అందోళ‌న పెరుగుతుంది. 2014 లో కేసీఆర్ గెలిచి సీఎం అయ్యారు. తెలంగాణలో ఎదురులేని నేతగా పేరుతెచ్చుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే అధికారం అనుకున్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే వంద సీట్లకు పైగా గెలుస్తామంటూ 8 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. తొలివిడతలో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు చూపించారు. అధికారం మళ్ళీ తమదే అని ధీమాగా ఉన్నారు. కానీ ఇక్కడ నుంచే పరిస్థితులు ఒక్కొక్కటిగా కేసీఆర్ కి వ్యతిరేకంగా మారడం మొదలు పెట్టాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. దీంతో కూటమి రూపంలో కేసీఆర్ కి బలమైన ప్రత్యర్థి వచ్చింది. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు తెలంగాణలో కాంగ్రెస్ అంతోఇంతో బలంగా ఉంది కానీ.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అనే అభిప్రాయం ఉండేది. కానీ కూటమి బలంతో కాంగ్రెస్ బలం రెట్టింపు అయింది. ముఖ్యంగా టీడీపీ కేడర్ బలం కాంగ్రెస్ కి కలిసొస్తుంది. సర్వేలు కూడా మహాకూటమికే విజయావకాశాలు ఎక్కువున్నాయని చెప్తున్నాయి. ఇదే కేసీఆర్ కి మింగుడుపడటం లేదు. దీనికి తోడు కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్న మరో అంశం గ్రామాల్లో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎదురవుతున్న నిరసన సెగ. కేసీఆర్ తాను సర్వేలు చేయించుకున్నాను. అన్ని సర్వేల్లో వందకి పైగా సీట్లు వస్తాయని తేలింది అన్నారు. తమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ప్రజలు తెరాస ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. కారు గుర్తు కనిపిస్తే చాలు ఓట్లు గుద్దేస్తారు అనుకున్నారు. అందుకేనేమో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా.. ‘కేసీఆర్ బ్రాండ్ తో ఈజీగా గెలవొచ్చు’ అనే కాన్ఫిడెన్స్ తో మార్చకుండా దాదాపు వారినే అభ్యర్థులుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ కాన్ఫిడెన్సే కొంపముంచింది అనిపిస్తోంది.

* ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేసారని ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారు? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. కొందరు నేతలని అయితే అసలు గ్రామాల్లోనే అడుగు పెట్టనివ్వట్లేదు. అభ్యర్థులను మార్చలేక, ఈ అభ్యర్థులతో ఎలా గెలవాలో తెలియక కేసీఆర్ తల పట్టుకుంటున్నారు. కేసీఆర్ బలమైన నేత. ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వ్యక్తి. మరి అలాంటి కేసీఆర్ రాంగ్ స్టెప్ ఎలా వేశారు?. ఆయన పక్కన ఉన్నవారే మీ ఫోటో ఉంటే చాలు అభ్యర్థి ఎవరైనా ప్రజలు కళ్ళు మూసుకొని కారు గుర్తుకి ఓటేస్తారని ఆయనని ఇలా రాంగ్ స్టెప్ వేసేలా చేసారా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన మెప్పు కోసం ఎన్నైనా చెప్పి ఉండొచ్చు. కానీ ప్రజల్లో ఎమ్మెల్యేల మీద, పార్టీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నిజం చెప్తేనే కదా ఆయనకి తెలిసేది. అదీగాక ఆయన మీడియాకి కూడా అంత స్వేచ్ఛ ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీడియాకి స్వేచ్ఛ ఇస్తేనే కదా మంచి చేసినప్పుడు పొగడ్త.. తప్పు చేసినప్పుడు విమర్శ చేసి ప్లస్ లు, మైనస్ లు తెలిసేలా చేస్తుంది. ఇప్పుడు అనుకోని ఏం లాభం. నెలలో ఎన్నికలు ఉన్నాయి. మరి ఎన్నికల్లో కేసీఆర్ ఒకప్పటిలా దూసుకుపోతారో లేదో చూడాలి.

telangana elections updates

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *