కేసీఆర్ మాట వినని ఆ తాజా మాజీ ఎమ్మెల్యే

KCR Update News

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కూడా గులాబీ గూటిలోని అసమ్మతి చల్లారలేదు. అందర్నీ కంట్రోల్ చేసిన గులాబీ బాస్ ఆమెను మాత్రం కంట్రోల్ చెయ్యలేకపోతున్నాడు. 105మంది అభ్యర్థులతో కేసీఆర్ తొలిదశ జాబితాను, తరువాత మరో ఇద్దరి పేర్లను ప్రకటించారు. దీంతో ప్రచారానికి ముందుకు వెళ్తున్నారు గులాబీ నాయకులు. అలా లిస్టు ప్రకటించగానే చాలా మంది అసంతృప్తులు తమ నిరసన తెలియజేశారు. నల్లాల ఓదెలు లాంటి తాజా మాజీలు తమకు టికెట్ ఇవ్వకపోతే అంతే అని పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేశారు. ఇక కొండా దంపతులు తెలంగాణా మీ అయ్యా జాగీరు కాదని టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. కానీ కేసిఆర్ బెదరలేదు. చివరికి కడియం శ్రీహరి లాంటి ప్రధాన నేత అలకబూనినా ఆయన దిగిరాలేదు. బతిమాలో, భయపెట్టో అందరినీ కంట్రోల్ చేశారు. అంతే కాకుండా మాట వినని అసమ్మతి నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇక కొండా వంటి వారు కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించారు.
టీఆర్ఎస్ అధినేతకు ఆమె ఒక్కరు చిరాకును తెప్పిస్తున్నారు. టికెట్ ఇవ్వకుంటే పార్టీ వీడి వెళ్ళాలి లేదా పార్టీ పై ఏదైనా మాట్లాడి వేటుకు గురి కావాలి కానీ ఆ మహిళా నాయకురాలు మహా ఘటికురాలు. ఇంత దాకా వచ్చాక ఏ మాత్రం తగ్గకుండా పార్టీని తిట్టకుండా ఎక్కడికక్కడ తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ పోతుంది. ఇంతకీ కేసీఆర్ కే చుక్కలు చూపుస్తున్న ఆ అసమ్మతి నేత ఇంకెవరో కాదు చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ .
ఇలా చాలా మంది అసంతృప్తులు ఇప్పటికే ఏదో ఒక నిర్ణయం తీసుకుని కేసీఆర్ ను ఇబ్బందిపెత్తకుండానే పోయారు. కానీ పార్టీలో ఉంటూనే చొప్పదండి నియోజకవర్గపు తాజా మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ మాత్రం కేసీఆర్ ను ఇబ్బంది పెడుతుంది. ఆమె ఏ మాత్రం తగ్గడం లేదు. 18 సంవత్సరాలు పార్టీకి పనిచేసినా టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్న ఆమె 119 స్థానాల్లో 107 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అందులో మహిళకు ఒక్క సీటు కూడ లేదని, తాను దళితురాలిని అయినందువలనే ఈ వివక్ష చూపుతున్నారని, ఇంతవరకు వచ్చాక ఈ వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్తుంది.
పగలు, రాత్రి అని తేడా లేకుండా తన మద్దతుదారుల్ని, కొంతమంది నాయకుల్ని కూడగట్టుకుని నియోజవర్గంలో మీటింగులు పెడుతూ తనకు కాకుండా తనపై కుట్ర చేసిన నాయకులకు టికెట్ ఇస్తే సహించేది లేదని తేల్చి చెప్తుంది. స్వతంత్ర్యంగా అయినా పోటీ చేస్తానని చెప్తున్న శోభ వ్యవహారం టీఆర్ఎస్ కు తలనొప్పిగా ఉంది 60 రోజుల నుండి ఆదోళన చేస్తున్న ఆమె విషయంలో అధిష్టానం ఇప్పటికీ స్పందించలేదు. ఆమె మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. కేసీఆర్ కు కంట్లో నలుసులా తయారయ్యింది.

KCR Update News , Telangana political news, Telugu News, KCR Latest News. Nallala Odelu Latest nesws , Choppadandi Ex MLA Bodige Shobha Comments on KCR 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *