కూటమి లిస్ట్ కోసం కేసీఆర్ వెయిటింగ్

KCR waiting for Kutami list

ముందస్తు సమరానికి సై అన్నారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల బరిలోకి దిగారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. అదే రోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించక ముందే అభ్యర్థులను జాబితా విడుదల చేయడంతో వారికి కావాల్సినంత సమయం దొరికింది. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ఎప్పుడో మొదలు పెట్టేశారు. వారిలో చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే తొలి దశ ప్రచారాన్ని కూడా ముగించేశారు. కేసీఆర్ ప్రకటించిన 105 స్థానాల్లో చాలా చోట్ల సిట్టింగులకే అవకాశం కల్పించిన ఆయన.. కొన్ని స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. కొద్దిరోజులుగా ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. మరోవైపు, అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లోని ఆశావాహుల వల్ల రేగిన అసంతృప్తిని ఇప్పుడిప్పుడే చల్లార్చుతోంది టీఆర్ఎస అధిష్ఠానం. ఇదే సమయంలో మరో రెండు స్థానాలకు కూడా గులాబీ బాస్ అభ్యర్థులను ప్రకటించారు. ఇంక మిగిలిన 12 మంది అభ్యర్థుల జాబితాను ఎప్పుడు ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సమయంలో దీనికి సంబంధించిన ఓ వార్త బయటికొచ్చింది.
కేసీఆర్.. టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి రెండు నెలలు దాటిపోవడంతో, పెండింగ్‌లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై పలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ జాబితాను అప్పుడు ప్రకటిస్తారు.. ఇప్పుడు ప్రకటిస్తారంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే, అవేమీ నిజం కాదని తేలిపోయింది. మరి, ఈ జాబితా విడుదలవ్వడానికి ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోందనే అనుమానం అందరిలో కలుగుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తే బయటికొచ్చింది.
అభ్యర్థులను రెండు నెలల క్రితమే ప్రకటించడంతో పాటు పలు సభలు నిర్వహించిన సీఎం కేసీఆర్.. మహాకూటమి వ్యూహాలపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారట. ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసిన ఆయన.. మహాకూటమి అభ్యర్థుల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని టాక్. దీనితో పాటు ఖైరతాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, చొప్పదండి వంటి నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉన్నందున.. టిక్కెట్ దక్కని నేతలు పార్టీ మారకుండా ఉండేందుకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వెల్లడించిన తర్వాత ఆయా అభ్యర్థలును బట్టి ఈ జాబితాను ప్రకటిస్తారని సమాచారం. మొత్తానికి మహాకూటమి లిస్టు కోసం కూటమి శ్రేనులే కాదు కేసీఆర్ కూడా ఘోరంగా వెయిట్ చేస్తున్నారట .

KCR waiting for Kutami list , KCR Latest News , Telugu News ,Telugu Update News, Telugu Political News, telangana Latest News

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *