చంద్రబాబు హామీ.. పొత్తుపై నిర్ణయం మార్చుకున్న కేఈ

KE Krishna Murthy
తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని గతంలో వ్యతిరేకించిన ఓ టీడీపీ ప్రముఖుడు.. ఇప్పుడు మాత్రం సమర్ధిస్తున్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. కొద్దిరోజుల క్రితం టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసిమెలసి ఉండడాన్ని ఆయన వ్యతిరేకించారు. ‘‘కాంగ్రెస్‌, ప్రధాని మోదీ, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మాకు బద్ధశత్రువులు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తేలేదు. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదు, రాష్ట్ర ప్రజలు క్షమించరు, మా అధినేత చంద్రబాబు అటువంటి తప్పు చేయరు’’ అని వ్యాఖ్యానించారు. దీంతో అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. ఇది జరిగిన చాలా రోజులకు చంద్రబాబు అదే పని చేశారు. దీంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ప్రతి పార్టీ తమకు తోచిన విధంగా స్పందిస్తున్నాయి. ప్రతిపక్షాలు దీనిని విమర్శనాస్త్రంగా మార్చుకుంటే.. అధికార పక్షం మాత్రం సమర్ధించుకుంటోంది. ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు కూడా తమ అధినేత తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని స్టెట్‌మెంట్లు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో పొత్తును వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దీనిపై ఎలాంటి కామెంట్స్ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేఈ దీనిపై స్పందించారు.
రాహుల్-చంద్రబాబు భేటీపై ఏపీ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం బహిరంగ లేఖ రాశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఎం చంద్రబాబు భేటీపై ఆరోపణలు చేస్తున్న నేతలు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. రాహుల్‌గాంధీని చంద్రబాబు కలిస్తే… ఏదో జరిగిపోయిందంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు తర్వాత బీజేపీలో చేరినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? లక్ష్మీపార్వతి జగన్ కాళ్ళ దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా? టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా? విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారు. మనకు తీరని అన్యాయం చేసినవారిపై తిరగబడి హ్కకులను కాపాడుకోవాలనుకోవడం తప్పా? అని లేఖలో కేఈ ప్రశ్నించారు. గతంలో పొత్తు వద్దన్న ఆయనే ఇప్పుడు సమర్ధించడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయనలో మార్పుకు రావడానికి కారణం చంద్రబాబు ఇచ్చిన హామీయే అని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో, కొద్దిరోజుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో స్నేహ బంధం కొనసాగుతుందని, ఏపీలో మాత్రం అటువంటి పరిస్థితి ఉండదని కేఈకి, పొత్తు వ్యతిరేకిస్తున్న పలువురు నేతలకు టీడీపీ అధినేత వివరించారని సమాచారం. ఈ కారణంగానే కేఈ ఇప్పుడిలా మాట్లాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

KE Krishna Murthy ,  AP, Deputy CM Krishna Murthy, Chandrababu political News,AP Latest News, AP Minister KE Krishnamurthy latest News Chandrababu, Congress party News.AP Latest News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *