`2.0`లో కీర‌వాణి

keeravani in 2.0
ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `రోబో` సీక్వెల్ `2.0`. అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టిస్తుంటే.. ఎమీ జాక్స‌న్ రోబోట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. ఎ.ఆర్‌.రెహమాన్ సంగీత ద‌ర్శ‌కుడు. మ‌రి సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణికి 2.0తో సంబంధం ఏంట‌ని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి.. ఎ.ఆర్‌.రెహ‌మాన్ కోరిక మీద 2.0 తెలుగు వెర్ష‌న్‌లో ఎం.ఎం.కీర‌వాణి ఓ పాట పాడ‌బోతున్నాడు. భ‌లే గువ్వ.. అనే ఈ పాట త్వ‌ర‌లో విడుద‌ల కూడా కానుంది. 550 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాష్ క‌ర‌ణ్ నిర్మించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. సినిమాను న‌వంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. .

 

keeravani in 2.0 , Rajanikanth  with Shanker Director Movie 2.0 , Akshay kumar , AR Rahman, New Telugu Movie, Telugu Latest movie , Keeravani in 2.0 Movie.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *