కీర్తి సురేష్ చాప్టర్ క్లోజ్?

KEERTHI SURESH CHAPTER CLOSE
ఆమె మహానటిగా తన అద్వితీయ నటనను చూపించి ఒక్కసారిగా సినీ వినీలాకాశంలో తారకలా తళుక్కుమంది. మ‌హాన‌టి చిత్రంతో త‌న కీర్తిని అమాంతం పెంచేసుకుని స్టార్ హీరోయిన్ల లిస్టులో చేర‌పోయిన కీర్తి సురేష్ ఆ త‌ర్వాత వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఈ బొద్దు భామ క్రేజ్ ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది . వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో న‌టిస్తున్న కీర్తి.. ఆ చిత్రాల‌న్నీ బాక్సాఫీసువ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డ‌డంతో ఈ ముద్దుగుమ్మ కెరీర డేంజ‌ర్ జోన్‌లో ప‌డింది.

ఈ ఏడాది ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టించిన అజ్ఞాత‌వాసి చిత్రంతో భారీ డిజాస్ట‌ర్ అందుకుంది కీర్తి సురేష్ .ఆ త‌ర్వాత‌ న‌టించిన మ‌హాన‌టి చిత్రంతో త‌న జీవితంలోనే గుర్తుండిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. ఔరా అని సినీ వర్గాలతో అనిపించింది. ఇక ఆ త‌ర్వాత త‌మిళంలో వ‌రుస‌గా న‌టించిన.. భారీ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌న్నీ కీర్తికి షాక్ ఇచ్చాయి. విక్ర‌మ్‌తో సామి స్కేర్ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఈ చిత్రంతో పాటు కీర్తి పైనా కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ చిత్రంలో కీర్తి బండ‌గా, ఎబ్బెట్టుగా ఉంద‌ని కామెంట్స్ వినిపించాయి. ఇక ఆ త‌ర్వాత‌ విశాల్‌తో న‌టించిన పందెంకోడి-2 యావ‌రేజ్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కూడా కీర్తి న‌ట‌నను ఓవ‌రాక్ష‌న్ గా ఫీల్ అయ్యారు ప్రేక్షకులు. ఇక తాజాగా వ‌చ్చిన స‌ర్కార్ చిత్రం అయితే కీర్తిని పూర్తిగా ముంచేసింది. స‌ర్కార్ చిత్రంలో కీర్తి పాత్ర‌కు అస్స‌లు ప్రాధాన్య‌త లేదు. ఏదో రెండు సీన్లు, ముడు పాట‌లకు అన్న‌ట్టు కీర్తి పాత్ర‌ను డిజైన్ చేశాడు మురుగ‌దాస్. దీంతో ప్ర‌స్తుతం కీర్తి క్రేజ్ అమాంతం ప‌డిపోయింది. దీంతో ఇక‌ముందైనా త‌ను న‌టించే చిత్రాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు వ‌హించ‌కుంటే.. కీర్తి చాప్ట‌ర్ క్లోజ్ అవ‌డం ఖాయ‌మ‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. మరి ఈ బొద్దు గుమ్మడు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తే, అలాగే కాస్త స్లిమ్ అయ్యే ఆలోచన చేస్తేనే అమ్మడికి అవకాశాలు.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *