కేరళకు ర్యాట్ ఫీవర్

Kerala Rat Fever

కేరళకు కొత్త కష్టం…మరణమృదంగం మోగిస్తున్న ర్యాట్ ఫీవర్ కేరళ వాసులను కష్టాలు వెంటాడుతున్నాయి. మొన్నటిదాకా వరదలతో అతలాకుతలమైన కేరళ కు ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది. ర్యాట్ ఫీవర్ కేరళ వాసులను వణికిస్తుంది. కేరళ వరద బాధిత ప్రాంతాల్లో సోకుతున్న ఈ ఫీవర్ కేరళ వాసుల ప్రాణాలు హరిస్తుంది.  ఇప్పటికి 8 మంది ర్యాట్ ఫీవర్ తో మృత్యు వాత పడ్డారు. వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కేరళ వరద కష్టాలు ఇంకా తీరలేదు. వరదల వల్ల కొట్టుకొచ్చిన మృత కళేబరాలు, శుభ్రం చెయ్యలేని విధంగా వీధులు వుండటం వల్ల కళేబరాలు కుళ్లిపోయి వ్యాధులకు కారణం అవుతున్నాయి. అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత తాగునీరు, ఆహారం వల్ల కేరళ వాసులు వ్యాధుల బారిన పడుతున్నారు.  వరదనీరు, జంతువుల కలేబరాలు వీధుల్లోనే ఉండటంతో కలుషితం జరిగి ర్యాట్ ఫీవర్ ప్రబలుతోంది. మొదట్లో జంతువులకు సోకిన ఈ ఫీవర్ క్రమంగా మనుషులకు పాకుతోంది. ఇప్పటికే దీని ప్రభావంతో 8మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది.   దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే దీని ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన మెడిసిన్ అందిస్తోంది.  కోజ్హికోడే మెడికల్ కాలేజీలో ర్యాట్ ఫీవర్ కేసులు  40 నమోదయ్యాయి. వందల సంఖ్యలో ప్రజలు జ్వరం బారిన పడుతున్నారు. ర్యాట్ ఫీవర్ తో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇక దీనిపై కేరళ హెల్త్ మినిస్టర్ శైలజ  ర్యాట్ ఫీవర్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు . అన్ని హాస్పిటల్స్ లో  ఇందుకు సంబంధించిన మెడిసిన్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే కలుషితమైన ఆహారానికి దూరంగా ఉండాలని చెప్పారు.

అయితే కేరళ వరద బాధిత ప్రాంతాల ప్రజలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జంతు కళేబరాలను తొలగించాలని , అపరిశుభ్ర పరిసరాల వల్లే తాము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. వరదల వల్ల అన్నీ కోల్పోయిన తమకు ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం వుందని వారంటున్నారు. ఆహారం, త్రాగునీరు అందించాలని,ఇంకా తాము కోలుకోలేకపోతున్నామని చెప్పి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం అడుగుతున్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సహాయం అందించాలని వేడుకుంటున్నారు.

Rat Fever In Kerala, Kerala Scared On Rat Fever, Kerala Whater Floods Updaes, New Problems For Kerala, Kerala Latest Updates, What About Rat Fever, Telugu Latest Updates, 8Died In Kerala Rat Fever, Kerala Latest Updates, Kerala Floolds Impacts, Breaking News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *