ఖైరతాబాద్ టికెట్ కోసం టీఆర్ఎస్ లో తీవ్ర పోటీ

Khairatabad TRS Ticket

ముందస్తు ఎన్నికలకు ముందడుగు వేసినలో ఇంకా అభ్యర్థులను ప్రకటించని స్థానాల్లో పోటీ నెలకొంది. ఒకే విడతలో 105 మంది టికెట్లు ప్రకటించిన టీఆర్ఎస్‌కు అసమ్మతి నేతలు ఇచ్చిన షాక్ తో ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తుంది. మిగిలిన స్థానాల్లో ఎక్కడికక్కడ చాలా పోటీ తో పాటు సమస్యలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ స్థానం ఖైరతాబాద్. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేది ఎవరన్న చర్చ చాలాకాలంగా జరుగుతున్నదే. ఓవైపు ఎన్నికల నోటిఫికేషన్‌కు గడువు దగ్గరపడుతున్నా ఖైరతాబాద్ పీటముడి మాత్రం ఇంకా వీడలేదు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత దానం నాగేందర్ గులాబీ కండువా కప్పుకున్న నాటి నుంచే ఖైరతాబాద్ సీట్ గురించి టీఆర్ఎస్ వర్గాల్లో చర్చమొదలైంది. దానం నాగేందర్‌కు గోషామహల్ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తనకు గోషామహల్ టికెట్ అక్కర్లేదని దానం నాగేందర్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ సీటుపై దానం కన్నేయడంతో అప్పటికే ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్నవారిలో అలజడి రేపింది. టీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ టికెట్ రేస్‌లో కార్పొరేటర్లు విజయా రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి ఎప్పట్నుంచో ఉన్నారు. టికెట్ తమకే వస్తుందని ఈ ఇద్దరూ చాలాకాలంగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు… కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి కూడా ఖైరతాబాద్ టికెట్‌పై కన్నేశారు. ఆ తర్వాత దానం రాకతో పోటీ ఎక్కువైంది. ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ మన్నెగోవర్ధన్ రెడ్డి టికెట్ తనకే వస్తుందన్న ఆశతో చాలాకాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ వచ్చారు. ఇంటింటికీ టీఆర్ఎస్ పేరుతో జనంలోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది. మన్నెగోవర్ధన్ రెడ్డికి ఖైరతాబాద్ టికెట్ వచ్చే అవకాశాలు లేవని దాదాపుగా తేలిపోయింది. కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి కూడా రేస్ నుంచి తప్పుకున్నారు. మరోవైపు పీజేఆర్ కూతురు, కార్పొరేటర్ విజయా రెడ్డి ఖైరతాబాద్ టికెట్ కోసం తీవ్రస్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం దానం నాగేందర్, విజయా రెడ్డి మధ్యే పోటీ నెలకొంది.
గణేష్ నవరాత్రుల సమయంలో దానం నాగేందర్ ఖైరతాబాద్‌లోని వినాయక మండపాలను సందర్శించి… తాను ఇక్కడే పోటీ చేస్తానని పలువురితో చెప్పారన్న ప్రచారం ఉంది. దీంతో ఖైరతాబాద్ టికెట్ విషయంలో టీఆర్ఎస్ వర్గాల్లో అయోమయం నెలకొంది.ఖైరతాబాద్ టీఆర్ఎస్ టికెట్ దానం నాగేందర్ కన్నా విజయా రెడ్డికే ఇచ్చే అవకాశాలు ఎక్కువ అన్న వాదన వినిపిస్తోంది. కారణం… విజయా రెడ్డికి ఖైరతాబాద్‌లో మంచి పేరు ఉండటమే. జనంలో తిరిగే నేతగా విజయా రెడ్డికి గుర్తింపు ఉంది. మాస్ లీడర్‌గా పేరుంది. తన తండ్రి పీజేఆర్ సృష్టించిన ఓటు బ్యాంక్ విజయా రెడ్డికి కలిసొచ్చే మరో అంశం. ఇవన్నీ చూస్తే… ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ కన్నా… విజయా రెడ్డికే విజయావకాశాలు ఎక్కువ అన్న వాదన వినిపిస్తోంది. పార్టీ ముఖ్య నేతలు సైతం విజయా రెడ్డికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధిష్టానం కూడా విజయారెడ్డికే బీఫామ్ ఇచ్చే అవకాశాలున్నాయి. మరి టికెట్ ఇస్తే తెలుస్తుంది ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో..

Khairatabad TRS Ticket , Strong competition in TRS for Khairatabad Ticket , Hyderabad Latest News, Telangana, Latest News,  Telugu News,  TRS Political News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *