గులాబీ పార్టీకి ఖైరతాబాద్ లో ఊరట దొరికినట్టే

Kirathabad TRS seat News

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో పార్టీల నుండి బీ ఫాం పొందిన వాళ్ళు నామినేషన్ల బిజీ లో ఉన్నారు. అంతేనా పార్టీల నుండి టికెట్ ఆశించిన ఆశావహులు కూడా రెబల్స్ గా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే చాలా మంది నామినేషన్లు కూడా వేసి అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన అభ్యర్థుల జాబితా పార్టీ లో చిచ్చు పెట్టింది. అసమ్మతి వాదులు రెబల్స్ గా బరిలోకి దిగాలని చాలా చోట్ల ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ప్రతిష్టాత్మకమైన స్థానం ఖైరతాబాద్. ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు ఇదే స్థానం కోసం టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అందుకోసం అక్కడి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్ కేటాయించింది. ఆయనకు టికెట్ ఇవ్వాలనుకున్న టీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయాన్ని మాజీ మంత్రి పీ జనార్ధన్ రెడ్డి కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి వ్యతిరేకించారు. అంతే కాదు తనకు టికెట్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారని తెలుస్తుంది.
సమస్యాత్మకమైన ఖైరతాబాద్ నియోజకవర్గ స్థానానికి దానం నాగేందర్‌ పేరునే ఫైనల్ చేశారు గులాబీ బాస్ దానం కు టికెట్ హామీ ఇచ్చిన నేపధ్యంలో గులాబీ బాస్ కు ఆయనకు టికెట్ ఇవ్వక తప్పలేదు. అయితే విజయా రెడ్డి నుండి తీవ్ర వ్యతిరేఖత రాకుండా చర్చలు జరిపారు కేటీఆర్ . సెప్టెంబర్ 6 నుంచి ఉన్న అసమ్మతిని తగ్గిస్తూ వచ్చిన టీఆర్ఎస్ అధిష్ఠానం ఖైరతాబాద్‌లోనూ సక్సెస్ అయింది. విజయారెడ్డి టీఆర్‌ఎస్‌ టికెట్టును ఆశించినా మంత్రి కేటీఆర్‌తో చర్చల అనంతరం వెనక్కు తగ్గారు.
ఈ మధ్యే పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌కు టికెట్టు ఖరారు చేయడంతో ఆమె రెబల్‌గా బరిలో ఉంటారని అందరూ భావించారు. రెబల్‌గా బరిలో దిగే విషయమై తమ అనుయాయులు, మద్దతుదారులతో చర్చించిన ఆమె మంత్రి కేటీఆర్‌ జోక్యంతో విరమించుకున్నారు. ఆ వెంటనే మాజీ మంత్రి దానం నాగేందర్‌.. విజయారెడ్డి నివాసానికి వెళ్లి తనకు మద్దతు ప్రకటించాలని కోరడంతో ఆమె అంగీకరించారు. దీంతో టీఆర్ఎస్‌కు ఆ స్థానంలో చాలా పెద్ద రిలీఫ్ వచ్చినట్లైంది. ఇక ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించింది . ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య త్రికోణ పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి విజయా రెడ్డి శాంతించటంతో ఊపిరి పీల్చుకుంది టీఆర్ఎస్.

Kirathabad TRS seat News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *